రూ.15 వేల ధరలో 64MP కెమెరా, 5500mAh బ్యాటరీ, 3D కర్వడ్ డిస్‌ప్లే ఫోన్.. ఇవాళ్టి నుంచి సేల్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి ఇటీవల కాలంలో బెస్ట్ డిజైన్, ఫీచర్‌తో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G విడుదల అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది. రూ.12 వేల ధర సెగ్మెంట్‌లో బెస్ట్ హ్యండ్‌సెట్‌గా ఉంది. ఈ ధర సెగ్మెంట్‌లో అనేక AI ఫీచర్‌లు కలిగిన ఫోన్‌గా ఉంది. ఇదే సిరీస్ నుంచి ఏప్రిల్ 18 వ తేదీన ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Note 50s 5G Smartphone Sale) విడుదల అయింది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది.
ధర వివరాలు :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. తొలి రోజు సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.14999 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫోన్ భారత్ మార్కెట్‌లో టైటానియం గ్రే, రుబీ రెడ్, మెరైన్ డ్రీఫ్ట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ బడ్జెట్ ధరలో ఈ హ్యాండ్‌సెట్ అనేక బెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. మరియు వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. మరియు సన్నని డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.
మిలిటరీ గ్రేడ్ డిజైన్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్, 2304Hz PWM డిమ్మింగ్ రేట్ తో 6.78 అంగుళాల ఫుల్ HD 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు IP64 రేటింగ్‌తో వాటర్ మరియు డస్ట్ రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రిమేట్ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది. రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.
90fps ఫ్రేమ్ రేట్ :
ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. మరియు ఈ ఫోన్ గేమింగ్ సమయంలో ఈ ఫోన్ 90fps ఫ్రేమ్ రేట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ రుబి రెడ్, టైటానియం గ్రే వేరియంట్స్ మెటాలిక్ ఫినిష్‌ను కలిగి ఉంటాయి. అదే మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ వేరియంట్ వేగాన్ లెదర్ ప్యానల్ ను సపోర్టు చేస్తుంది.
64MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ బెస్ట్ కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు 64MP సోనీ IMX682 ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా 30fps వద్ద 4K రికార్డింగ్ ను సపోర్టు చేస్తుంది.
5500mAh బ్యాటరీ :
ఈ కెమెరా అనేక AI టూల్స్‌ను సపోర్టు చేస్తుంది. ఇందులో AI Eraser, AIGC మోడ్, AI వాల్ పేపర్ జనరేటర్, పోలెక్స్ AI అసిస్టెంట్ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ కేవంల 60 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది. భద్రత కోసం ఈ ఫోన్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








