బడ్జెట్ ధరలో 64MP కెమెరా, వేగాన్ లెదర్, మిలిటరీ గ్రేట్ సర్టిఫికేషన్‌తో 5G స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ గత సంవత్సరం అనేక ఫోన్‌లను తీసుకొచ్చింది. 2025 తొలి భాగంలో బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ ను (Infinix Note 50s 5G Smartphone) లాంచ్ చేసింది. ఈ ఫోన్ 64MP కెమెరా, 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌తోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉన్నాయి. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కూడా కలిగి ఉంది.
ధర వివరాలు :
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ను పొందవచ్చు.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, రుబి రెడ్, టైటానియం గ్రే కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల FHD 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రిమేట్ SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
64MP కెమెరా, ఏఐ ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 64MP సోనీ IMX682 కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. AI Eraser, AI Wall Paper Generator వంటి ఫీచర్లు ఉన్నాయి.
5500mAh బ్యాటరీ :
ఈ కెమెరా అనేక AI టూల్స్‌ను సపోర్టు చేస్తుంది. ఇందులో AI Eraser, AIGC మోడ్, AI వాల్ పేపర్ జనరేటర్, పోలెక్స్ AI అసిస్టెంట్ వంటి అనేక ఫీచర్ లను కలిగి ఉన్నాయి.
ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 60 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ చేస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ పోలెక్స్ ఏఐ అసిస్టెంట్ ను కలిగి ఉంది. గేమింగ్ సమయంలో ఈ ఫోన్ 90fps ఫ్రేమ్ రేట్ ను సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








