Home
Mobile

ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ వచ్చేస్తోంది.. సువాసనలు వెదజల్లే 'సెంట్ టెక్నాలజీ'తో.. ఏప్రిల్ 18న భారత్‌లో విడుదల

Infinix Note 50s 5G+ launch : టెక్నాలజీ ప్రపంచంలో మరో కొత్త అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఇన్ఫినిక్స్ కంపెనీ, ఏప్రిల్ 18న భారతదేశంలో తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్, నోట్ 50ఎస్ 5జీ+ ను విడుదల చేయబోతోంది. అయితే, ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇందులో "ఎనర్జైజింగ్ సెంట్-టెక్" అనే ఒక అసాధారణమైన ఫీచర్ ఉంది. అంటే, ఈ ఫోన్ వెనుక భాగం నుంచి ఒక మంచి సువాసన వస్తుందన్నమాట.

ఇప్పటి వరకు మనం ఫోన్లను చూశాం, విన్నాం, తాకాం.. కానీ ఇప్పుడు సువాసన కూడా ఆస్వాదించవచ్చు. ఈ సరికొత్త టెక్నాలజీ కేవలం 'మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ' రంగు వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది, ఇది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇవ్వనుంది. మరి సెంట్-టెక్ అంటే ఏంటో తెలుసుకుందాం.

Infinix NOTE 50s 5G

* ఏంటీ సెంట్-టెక్.. ఎలా పనిచేస్తుంది..?
ఇంతకీ ఈ 'సెంట్-టెక్' ఎలా పనిచేస్తుందంటే, ఇందులో 'మైక్రోఎన్‌క్యాప్సులేషన్ టెక్నాలజీ' వాడారు. అంటే, సువాసన ఇచ్చే అణువులను చిన్న చిన్న కణికల్లా (క్యాప్సూల్స్) మార్చి, వాటిని ఫోన్ వెనుక ఉండే వేగన్ లెదర్ (జంతు చర్మం వాడని ప్రత్యేక లెదర్) లోపల అమర్చుతారు.

మనం ఫోన్‌ను పట్టుకున్నప్పుడు లేదా వాడేటప్పుడు, ఈ కణికల నుంచి నెమ్మదిగా, ఆహ్లాదకరమైన సువాసన బయటకు వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ సువాసనలో సముద్రపు తాజాదనం, నిమ్మకాయ వాసనలు ముందుగా వచ్చి, తర్వాత 'లిల్లీ ఆఫ్ ది వ్యాలీ' పూల సువాసన, చివరగా అంబర్, వెటివర్ వంటివి కలిసి ఉంటాయి.

ఈ వాసన మరీ ఎక్కువగా కాకుండా, ఫోన్ వాడే అనుభూతిని మరింత పెంచేలా డిజైన్ చేశారు. ఈ సువాసన దాదాపు 6-నెలల వరకు ఉంటుందట. కానీ వాడకం, వేడి, గాలిలో తేమ వంటి వాటిని బట్టి దీని ప్రభావం మారవచ్చు. ప్రస్తుతానికి, ఈ సువాసన అయిపోయాక మళ్లీ నింపడం లేదా దాని కాలాన్ని పొడిగించడం కుదరదు.

* డిజైన్, రంగులు ఎలా ఉన్నాయి..
ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50ఎస్ 5జీ+ ఫోన్ మూడు రంగుల్లో వస్తోంది: మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, టైటానియం గ్రే, రూబీ రెడ్. వీటిలో, మనం చెప్పుకున్న 'సెంట్-టెక్' ఫీచర్ కేవలం 'మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ' రంగు మోడల్‌లో మాత్రమే ఉంది. ఈ మోడల్ వెనుక భాగం వేగన్ లెదర్‌తో చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

మిగిలిన 'టైటానియం గ్రే', 'రూబీ రెడ్' రంగు ఫోన్లు మెటాలిక్ ఫినిష్‌తో (లోహంలా మెరిసే లుక్) వస్తాయి. దీన్ని బట్టి, సువాసనలు వెదజల్లే మోడల్‌ను ఒక ప్రత్యేకమైన, ప్రీమియం అనుభూతినిచ్చే వేరియంట్‌గా కంపెనీ చూపిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఎంతలా హిట్ అవుతుందో చూడాలి.

* కెమెరా, ధర ఎంత ఉండొచ్చు..
ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్‌తో కూడిన మెయిన్ కెమెరా ఉంది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు కానీ దీని ధర రూ.20,000లోపే ఉంటుందని లీక్ చేసింది. ఫోన్ ఫీచర్లు, కచ్చితమైన ధర, లభ్యత వంటి వివరాలన్నీ ఏప్రిల్ 18న అధికారికంగా వెల్లడిస్తారు.

* కంపెనీ ఏమంటోంది..
ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ, అనీష్ కపూర్, ఈ కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, "ఫోన్లు కేవలం చూడటానికి, తాకడానికి మాత్రమే కాదు, మరిన్ని ఇంద్రియాలకు అనుభూతిని ఎలా ఇవ్వగలవని ఆలోచించాం. మనందరికీ మంచి సువాసన అంటే ఇష్టం. చూడటానికి బాగుండి, మంచి వాసన కూడా వచ్చే వస్తువును మనతో పాటు ఉంచుకోగలిగితే, బాగుంటుంది కదా?" అని అన్నారు.

వినియోగదారులకు ఊహించని ఆశ్చర్యాన్ని ఇవ్వడమే ఈ 'సెంట్-టెక్' ఉద్దేశమని, ఇలాంటిది ఒకటి కావాలని వారు అనుభవించే వరకు వారికి కూడా తెలియకపోవచ్చు అని ఆయన తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix NOTE 50s 5G+ with First-of-its-Kind Scent Technology Launching in India on April 18
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X