Home
Mobile

అదిరిపోయే లుక్‌, AI ఫీచర్‌లు, మిలిటరీ గ్రేడ్‌ డిజైన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ మరికొన్ని రోజుల్లో నోట్‌ 50X 5G స్మార్ట్‌ఫోన్‌ను (Infinix Note 50X 5G Smartphone) భారత్‌ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. బ్యాక్‌ ప్యానల్‌ డిజైన్‌ సహా అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి కీలక సమాచారం వెల్లడయింది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది :
ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G స్మార్ట్‌ఫోన్‌ మార్చి 27న భారత్‌ లో విడుదల కానుంది. విడుదల అనంతరం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన మరిన్ని కీలక వివరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ద్వారా ఈ ఫోన్‌ ఫీచర్‌లు తెలిశాయి.

Infinix Note 50X 5G

కలర్‌ వేరియంట్స్‌ :
తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాలు ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మరియు మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ పర్పుల్‌, గ్రే, గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. గ్రీన్ కలర్‌ వేరియంట్‌ వేగాన్‌ లెదర్‌ తో కూడిన బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. మిగిలిన రెండు వేరియంట్స్‌ మెటాలిక్ ఫినిష్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

మిలిటరీ గ్రేడ్‌ :
ఈ ఫోన్‌ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా మిలిటరీ గ్రేడ్‌ MIL- STD 810H కలిగి ఉంటుంది. మరియు మెరుగైన రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ సన్నని బెజిల్స్‌ మరియు పంచ్‌ హోల్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే డిస్‌ప్లే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50X 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ SoC తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ మల్టీ టాస్కింగ్‌ సమయంలోనూ మెరుగైన పనితీరును అందిస్తుందని సంస్థ చెబుతోంది. మరియు ల్యాగ్‌ ఫ్రీ గేమింగ్‌ కు సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుందని తెలిపింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు :
ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. AIGC పొర్ట్రెయిట్‌ మోడ్‌ల AI నోట్‌, Folax AI వాయిస్‌ అసిస్టెంట్‌, AI రైటింగ్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. IR సెన్సార్‌ కూడా కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ నోట్‌ 50X 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన డిజైన్‌ తో కూడిన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు వెనుక వైపు LED ఫ్లాష్‌ యూనిట్‌, యాక్టివ్‌ హాలో యూనిట్‌ కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీ టైమర్‌, ఛార్జింగ్‌ స్టేటస్‌, నోటిఫికేషన్‌ లైట్‌ తెలుసుకొనేందుకు అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ వేరియంట్స్‌, డిస్‌ప్లే, సహా కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. మరియు ఎంత ధర లో లాంచ్‌ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే డిజైన్‌ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

FAQs
GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 50X 5G colour variants revealed ahead of launch on march 27 on india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X