Home
Mobile

రూ.10499 కే 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, డ్యూయల్‌ LED ఫ్లాష్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ (Infinix Note 50x 5G Smartphone) భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. రూ.12000 ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ ఆకట్టుకొనే డిజైన్‌, కలర్‌ వేరియంట్స్‌ను కలిగి ఉంది. మరియు 50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. తొలి సేల్‌లో భాగంగా తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంట్రీ లెవల్ ధరలో ఆకట్టుకొనే డిజైన్‌తో లాంచ్‌ అయింది. 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 672 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా MIL STD 810H సర్టిఫికేషన్‌ను ను కలిగి ఉంది.

Infinix note 50x 5G phone

చిప్‌సెట్‌ వివరాలు :
ఇన్ఫినిక్స్‌ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌తో వచ్చిన తొలి ఫోన్‌ నోట్‌ 50x 5G అని ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది. ఫ్లోటింగ్ విండో, డైనమిక్ బార్‌, గేమ్‌ మోడ్‌, కిడ్స్‌ మోడ్‌, పీక్‌ ప్రూఫ్‌ సహా ఫ్లోరెక్స్ స్మార్ట్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందిస్తామని ఇన్ఫినిక్స్ చెబుతోంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Infinix note 50x 5G phone

కెమెరా ఫీచర్లు :
కెమెరా విభాగం పరంగా ఈ ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో డెప్త్‌ సెన్సార్‌ను అమర్చారు. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

వెనుక వైపు డ్యూయల్‌ LED ఫ్లాష్‌ లైట్‌తోపాటు యాక్టివ్‌ హాలో లైటింగ్‌ను పొందవచ్చు. దీంతోపాటు AIGC పొర్ట్రెయిట్‌ మోడ్‌, AI వాల్‌పేపర్‌ జనరేటర్‌, AI నోట్‌, AI Eraser, AI Cut out, రైటింగ్‌ అసిస్టెంట్‌, డాక్యుమెంట్ అసిస్టెంట్, కాల్‌ అసిస్టెంట్‌, సోషల్‌ అసిస్టెంట్‌, సర్కిల్‌ టూ సెర్చ్‌ ఫీచర్‌లున్నాయి.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 45W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 10W రివర్స్‌ వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh సెమీ సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్‌ అయింది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 9 5G బ్యాండ్స్‌ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ IR బ్లాస్టర్‌ను సపోర్టు చేస్తుంది.

ఇన్ఫినిక్స్‌ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఇన్ఫినిక్స్‌ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ (Infinix Note 50x 5G Sale Date) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.12999 గా ఉంది. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

తొలి సేల్‌లో భాగంగా ICICI బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫలితంగా ఈ ఫోన్‌ రూ.10499, రూ.11999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ టైటానియం గ్రే, సీ బ్రీజ్‌ గ్రీన్‌, ఎన్‌ఛాంటెడ్‌ పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది. గ్రీన్‌ కలర్‌ వేరియంట్ వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. మిలిగిన రెండు కలర్‌ వేరియంట్స్‌ మెటాలిక్ ఫినిష్‌ను కలిగి ఉంటాయి.

FAQs
ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర ఎలా ఉంది?

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.11499 గా ఉంది. అయితే తొలి సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫలితంగా రూ.10499 గా ధర ఉంది.

ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది?

ఈ ఫోన్‌ ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ నోట్‌ 50x 5G ఫోన్‌ 5G నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తుందా?

ఈ ఫోన్ 9 5G బ్యాండ్స్‌ను సపోర్టు చేస్తుంది.

GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix note 50x 5G phone launched with 5500mAh Battery Mediatek Dimensity 7300 Ultimate chipset
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X