రూ.12000 ధరలో 50MP కెమెరా. 5500mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్.. ఆకట్టుకొనేలా డిజైన్, కలర్ వేరియంట్స్!
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ రేపు (మార్చి 27) మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన డిజైన్ సహా అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు రూ.12000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది.
డిజైన్ పరంగా ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Note 50X 5G Smartphone) ఆకట్టుకుంటోంది. ఫుల్ డిజైన్‌ను సంస్థ ఇప్పటికే విడుదల చేసింది. దీంతోపాటు కలర్ వేరియంట్స్ ఈ హ్యాండ్‌సెట్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ టైటానియం గ్రే, సీ బ్రీజ్ గ్రీన్, ఎన్ఛాన్టెడ్ పర్పుల్ రంగుల్లో విడుదల కానుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50X హ్యాండ్‌సెట్ గ్రే, పర్పుల్ కలర్ వేరియంట్స్ స్లీక్ మెటాలిక్ ఫినిష్‌ను కలిగి ఉంది. గ్రీన్ కలర్ వేరియంట్ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. స్లిమ్ బెజెల్స్ తోపాటు పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ధరలో బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లేకు సంబంధించిన ఇతర వివరాలు రేపు తెలియనున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50X స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ Gem cut కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. మరియు యాక్టివ్ హాలో లైటింగ్, LED ఫ్లాష్ ను కలిగి ఉంటుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. మరో కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. మరియు ఫ్లాష్ లైట్‌తో కూడిన 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ AI Object Eraser, AI Image Cutout, AIGC పొర్ట్రెయిట్ మోడ్, AI నోట్, Folax AI వాయిస్ అసిస్టెంట్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది.
ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని అమర్చారు. 10W వైర్ రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందో రేపు వెల్లడి కానుంది. అయితే ప్రారంభ ధర సుమారుగా రూ.12000 గా ఉంటుందని ఇన్ఫినిక్స్ తెలిపింది.


Click it and Unblock the Notifications








