రూ.12 వేల ధరలో మంచి 5G ఫోన్ కోసం చూస్తున్నారా.. ఇవాళ్టి నుంచే 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా ఫోన్ సేల్..!
భారత్ మార్కెట్‌లో ఇన్ఫినిక్స్ నుంచి సుమారు రూ.10,000 ధరలో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ ఆప్షన్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ (Infinix Note 50x 5G Smartphone Sale) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
ఇండియాలో ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ICICI బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ రూ.10499, రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ OS అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. డైనమిక్ బార్, గేమ్ అండ్ కిడ్స్ మోడ్, ఫ్లోరెక్స్ స్మార్ట్ అసిస్టెంట్ వంటి ఫీచర్‌లున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఎన్‌ఛాంటెడ్ పర్పుల్, టైటానియం గ్రే, సీ బ్రీజ్ గ్రీన్ వంటి కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ లభిస్తోంది. గ్రీన్ కలర్ వేరియంట్ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్ ఫినిష్, పర్పుల్, గ్రే కలర్ వేరియంట్స్ మెటాలిక్ ఫినిష్‌ను కలిగి ఉంది.
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ లో అందుబాటులో ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 672 గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ 50MP ప్రైమరీ, మరో డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటుకి వచ్చింది. యాక్టివ్ హాలో లైటింగ్, LED ఫ్లాష్ లైటింగ్‌ను కలిగి ఉంది.
ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ బడ్జెట్ రేంజ్ ధరలో అందుబాటులోకి వచ్చినా సర్కిల్ టూ సెర్చ్, రైటింగ్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, AI నోట్, పొర్ట్రెయిట్ మోడ్, AI వాల్‌పేపర్ జనరేటర్, AI Eraser, AI Cut out, కాల్ అసిస్టెంట్, సోషల్ అసిస్టెంట్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లున్నాయి.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, IR బ్లాస్టర్, USB-C ఛార్జింగ్ పోర్టులు ఉన్నాయి. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications






