రూ.11999 ధరకు ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 5G స్మార్ట్‌ఫోన్..!
ఇన్ఫినిక్స్ సంస్థ భారత్ మార్కెట్ లో ఈ సంవత్సరం అనేక మోడల్స్ ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం తొలిభాగంలో ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ ను (Infinix Note 50x 5G Smartphone) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ ఆకట్టుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. బడ్జెట్ రేంజ్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
రూ.11999 ప్రారంభ ధరకు :
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ ను ఇన్ఫినిక్స్ వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13499 గా ఉంది. ఎన్‌ఛాంటెడ్ పర్పుల్, సీ బ్రీజ్ గ్రీన్, సన్‌సెట్ స్పైస్ పింక్, టైటానియం గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ గ్రీన్ కలర్ వేరియంట్ వేగాన్ లెదర్ ఫినిష్ మరియు పర్పుల్, గ్రే కలర్ వేరియంట్స్ మెటాలిక్ ఫినిష్‌ను కలిగి ఉంది.
HD+ డిస్‌ప్లే :
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 672 గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50x 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్ ను కలిగి ఉంది. 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రైమరీ కెమెరా, మరో డెప్త్ సెన్సర్ ఉంటుంది. LED ఫ్లాష్ లైటింగ్, యాక్టివ్ హాలో లైటింగ్ ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా ఉంది. AI Eraser, AI Cut out, AI Wallpaper Generator వంటి పీచర్లు ఉన్నాయి.
ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 10W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. గేమ్ అండ్ కిడ్స్ మోడ్, ఫ్లోరెక్స్ స్మార్ట్ అసిస్టెంట్, డైనమిక్ బార్ ఫీచర్‌లున్నాయి. సర్కిల్ టూ సెర్చ్, Writing Assistant, Document Assistant, AI Note వంటి ఫీచర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications
