3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్..!
ఇన్ఫినిక్స్ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిన నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Note Edge 5G Smartphone) భారత్ లో ఫిబ్రవరి 18 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కు సంబంధించిన మైక్రోసైట్ కూడా లైవ్ లో ఉంది. దీని ఆధారంగా హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి.
మీడియాటెక్ చిప్‌సెట్ :
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ (Flipkart) ఆధారంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. ఈ చిప్ 7,50,000 AnTuTu స్కోర్ ను కలిగి ఉంటుందని తెలిపింది. OS సహా స్టోరేజీ వేరియంట్స్ వివరాలు తెలియాల్సి ఉంది.

3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ :
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, TUV బ్లూ లైట్ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ప్రత్యేకతలు :
ఈ ఫోన్ స్టెల్లర్ బ్లూ, సిల్క్ గ్రీన్, లూనార్ టైటానియం కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. బ్లూ కలర్ వేరియంట్ మెటాలిక్ బ్యాక్ ప్యానల్, గ్రీన్ వేరియంట్ సిల్క్ ఫైబర్ ఫినిష్ తో లాంచ్ కానుంది. బ్యాక్ ప్యానల్‌లో RGB హాలో లైట్ ఫీచర్ కూడా ఉంటుంది.

50MP కెమెరా సహా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. మిగిలిన కెమెరాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం JBL ట్యూనింగ్ తో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. 7.2mm థిక్‌నెస్ ను కలిగి ఉంటుంది. IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
గ్లోబల్ మార్కెట్ లో ఈ ఫోన్ ప్రారంభ ధర $200 (భారత కరెన్సీ ప్రకారం రూ.18200) గా ఉంది. అయితే భారత్‌లో ఈ హ్యాండ్‌సెట్ ఎంత ధరకు అందుబాటులోకి వస్తుందో వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








