6500mAh బ్యాటరీ, 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 5 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల..!
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ (Infinix Note Edge 5G Smartphone) భారత్ మార్కెట్ లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. దీంతోపాటు కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను అందిస్తుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల 1.5K LTPS 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతుంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
50MP కెమెరా, 6500mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, OTG, FM రేడియో, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. సిల్క్ గ్రీన్, స్టెల్లర్ బ్లూ, లూనార్ టైటానియం కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది.

ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇన్ఫినిక్స్ ఇండియా, ఫ్లి్‌ప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ లో భాగంగా ICICI, SBI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు స్క్రీన్ రీప్లేస్‌మెంట్, సంవత్సరం వరకు అదనపు వారంటీని అందిస్తామని ఇన్ఫినిక్స్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








