ఇవాళే 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఆండ్రాయిడ్ 16 OS 5G స్మార్ట్‌ఫోన్ సేల్.. రూ.2000 డిస్కౌంట్!
భారత్ మార్కెట్ లో ఇన్ఫినిక్స్ నుంచి ఇటీవల ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ (infinix Note Edge 5G Smartphone Sale) లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ ను ఇన్ఫినిక్స్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 గా ఉంది.

రూ.2000 డిస్కౌంట్ :
తొలి సేల్‌లో భాగంగా ICICI, SBI బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్ ను అందిస్తుంది. ఈ సేల్ లో భాగంగా సంవత్సరం వరకు అదనపు వారంటీని అందిస్తుంది. దీంతోపాటు 6 నెలల వరకు స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. స్టెల్లర్ బ్లూ, సిల్క్ గ్రీన్, లూనార్ టైటానియం కలర్ వేరియంట్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
3D కర్వడ్ డిస్‌ప్లే :
ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల 1.5K LTPS 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతుంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR5x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, మరో సెకండరీ కెమెరా ఉంది. దీంతోపాటు ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరా ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై, NFC, GPS, OTG, FM, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.


Click it and Unblock the Notifications








