Home
Mobile

సన్నని డిజైన్‌, 6500mAh బ్యాటరీ, 3D కర్వడ్‌ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌.. కీలక వివరాలు లీక్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ నుంచి త్వరలో నోట్‌ సిరీస్‌ నుంచి మరో మోడల్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఇన్ఫినిక్స్ నుంచి అనేక మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. టిప్‌స్టర్‌ పరాస్‌ గుగ్‌లానీ వివరాల ఆధారంగా ఇన్ఫినిక్స్‌ నోట్ ఎడ్జ్‌ ఫోన్‌ (Infinix Note Edge Smartphone) విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సన్నని డిజైన్‌ తో అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్‌ కు సంబంధించిన పోస్టర్‌ను కూడా టిప్‌స్టర్‌ లీక్‌ చేశారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన డిజైన్‌ సహా కొన్ని స్పెసిఫికేషన్ల వివరాలు లీక్‌ అయ్యాయి. ప్రీమియం డిజైన్‌, ఆకట్టుకొనే కెమెరా మాడ్యుల్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్‌ కూడా ఉంది.

Infinix Note Edge smartphone

3D కర్వడ్‌ డిస్‌ప్లే :
టిప్‌స్టర్‌ వివరాల ఆధారంగా ఇన్పినిక్స్‌ నోట్‌ ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ 3D కర్వడ్‌ అమోలెడ్‌ 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ మోటోరోలా ఎడ్జ్ 70, గెలాక్సీ S25 ఎడ్జ్‌, ఐఫోన్ ఎయిర్ మోడల్స్‌ కంటే కాస్త మందంగా ఉంటుందని తెలుస్తోంది.

5 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ నోట్‌ ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని టిప్‌స్టర్‌ చెబుతున్నారు. ఈ ఫోన్‌ మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని తెలిపారు.

6500mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌ కెమెరా మాడ్యుల్‌ డిజైన్‌ లీక్ అయింది. అయితే కెమెరా స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లపై ఇన్ఫినిక్స్ ఎంటువంటి స్పందన తెలియజేయలేదు.

ఇన్ఫినిక్స్‌ నోట్‌ ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌ 2026 జనవరి నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గ్రీన్‌ కలర్ వేరియంట్స్‌ లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. భారత్‌ మార్కెట్‌ లో రూ.20 వేల ధర రేంజ్‌ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల.. :
ఇన్ఫినిక్స్‌ నుంచి భారత్లో ఆగస్టు నెలలో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 60i 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 5.1 పైన పనిచేస్తోంది.

ఈ ఇన్ఫినిక్స్‌ హ్యాండ్‌సెట్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI Call Translation, AI Writing Assistant, AI Wallpaper Generator, AI Eraser, సర్కిల్‌ టూ సెర్చ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note Edge smartphone specifications tipped ahead of expected launch in january 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X