Infinix S5 Pro: సరసమైన ధరలో పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫోన్

|

ఇన్ఫినిక్స్ S5 ప్రోను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసారు. పాప్-అప్ సెల్ఫీ కెమెరాను అత్యంత తక్కువ ధర వద్ద అందిస్తున్న స్మార్ట్‌ఫోన్‌గా ఇన్ఫినిక్స్ S5 ప్రో ఇప్పుడు అధికారికంగా విడుదల అయింది. కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా ఇన్ఫినిక్స్ సంస్థ తన ఆన్-గ్రౌండ్ ఈవెంట్‌ను రద్దు చేసి ఈ రోజు స్మార్ట్‌ఫోన్‌ను నిశ్శబ్దంగా ఆవిష్కరించింది.

 

ఇన్ఫినిక్స్ S5 ప్రో

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో ఇన్ఫినిక్స్ సంస్థ ఇప్పుడు S5 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తుంది. ఇన్ఫినిక్స్ S5 మరియు S5 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ప్రీమియం ఫీచర్లతో మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఇన్ఫినిక్స్ S5 ప్రో ఇండియాలోకి ప్రవేశిస్తున్నది.

 

 

Realme X50 Pro 5G: అదరహో అనిపిస్తున్నసేల్స్ ఆఫర్స్Realme X50 Pro 5G: అదరహో అనిపిస్తున్నసేల్స్ ఆఫర్స్

ధరల వివరాలు
 

ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ S5 ప్రో USP యొక్క పాప్-అప్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండి కేవలం ఒకే ఒక వేరియంట్ తో వస్తుంది. 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ తో మాత్రమే లభించే ఈ ఫోన్ యొక్క ధర రూ.9,999 లుగా ఉన్నది. పాప్-అప్ సెల్ఫీ కెమెరా గల హానర్ 9X మరియు టెక్నో కామన్ 15 ప్రోలు వరుసగా రూ.13,999 మరియు రూ.14,999 ధరను కలిగి ఉన్నాయి.

 

 

James Bond: No Time To Die యాక్షన్ సన్నివేశాలలో నోకియా 5G స్మార్ట్‌ఫోన్James Bond: No Time To Die యాక్షన్ సన్నివేశాలలో నోకియా 5G స్మార్ట్‌ఫోన్

సేల్స్ ఆఫర్స్

సేల్స్ ఆఫర్స్

ఇన్ఫినిక్స్ S5 ప్రోను మార్చి 13 నుంచి ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనిని నెలకు రూ.840 EMI ధరతో కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్ జియోతో ప్రత్యేకమైన ఆఫర్ కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా వినియోగదారులు రూ.50 చొప్పున 24 వోచర్ల రూపంలో రూ.1,200 క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.

 

 

NASA తదుపరి రెడ్ ప్లానెట్ ప్రయోగం కోసం రోవర్ పేరు ఇదే...NASA తదుపరి రెడ్ ప్లానెట్ ప్రయోగం కోసం రోవర్ పేరు ఇదే...

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ S5 ప్రో యొక్క డిస్ప్లే విషయానికొస్తే ఇది 20: 9 కారక నిష్పత్తి మరియు 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో గల 6.53-అంగుళాల హెచ్‌డి+ రిజల్యూషన్ తో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే మెరుగైన బెజెల్స్ నిర్మాణంను కలిగి ఉంటుంది. అలాగే ముందు మరియు వెనుక వైపున 2.5D గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ను కూడా కలిగి ఉంది.

 

 

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

కెమెరా సెటప్

కెమెరా సెటప్

ఇన్ఫినిక్స్ S5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో మరియు రెండు 2-మెగాపిక్సెల్ కెమెరాలు డీప్ సెన్సార్‌ మరియు తక్కువ కాంతి సెన్సార్‌లతో వస్తాయి. ఇది వెనుక భాగంలో డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లను కలిగి ఉంటుంది. ఇందులోని డీప్ సెన్సార్‌ మోడ్ తక్కువ కాంతిలో కూడా తొమ్మిది రకాల సన్నివేశాలను గుర్తించగలదు. పోర్ట్రెయిట్ లెన్స్ అనుకూలీకరించదగిన సామర్థ్యంను కలిగిఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాప్-అప్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్

ఇన్ఫినిక్స్ S5 ప్రో స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఇంటర్‌ఫేస్‌తో గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ ను అందిస్తుంది. ఇది మీడియాటెక్ హెలియో P35 SoC ఆధారంగా రన్ అవుతుంది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. ఇది SD కార్డ్ స్లాట్ ను కలిగి ఉండి మెమొరీని 256GB వరకు విస్తరించడానికి వీలును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా XOS 6.0 డాల్ఫిన్ ఓఎస్‌తో రన్ అవుతుంది.

 

 

Tata Sky సెట్-టాప్-బాక్సుల పెరిగిన కొత్త ధరలు ఇవే...Tata Sky సెట్-టాప్-బాక్సుల పెరిగిన కొత్త ధరలు ఇవే...

బ్యాటరీ

బ్యాటరీ

ఇన్ఫినిక్స్ ఎస్ 5 ప్రో 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక ఛార్జీమీద 28 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై 802.11 a/b/g/n, బ్లూటూత్ 5.0, మరియు GPS ఫీచర్లు ఉన్నాయి. తాజా ఇన్ఫినిక్స్ ఫోన్ 162.5x76.88x8.95 mm పరిమాణంను కలిగి ఉండి 194 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Infinix S5 Pro Launched: Price in India, Specs and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X