రూ.6799 కే స్మార్ట్‌ఫోన్.. సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు.. ఆండ్రాయిడ్ 15 OS, 5000mAh బ్యాటరీ సహా!
Infinix Smart 10 Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ భారత్ మార్కెట్లో ఇటీవల ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 హ్యాండ్‌సెట్ ను విడుదల చేసింది. రూ.6799 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రేంజ్ లో అందుబాటులోకి వచ్చినా.. అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. నెట్‌వర్క్ లేకున్నా ఈ ఫోన్ నుంచి కాల్స్ చేసుకొనేందుకు ప్రత్యేక ఫీచర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ సేల్ ఇవాళ ప్రారంభం కానుంది.
రూ.6799 ధర :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.6799 గా ఉంది. ఈ ఫోన్ ను ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవవచ్చు. టైటానియం సిల్వర్, ఐరిస్ బ్లూ, స్లీక్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.

డిస్‌ప్లే వివరాలు :
ఇన్పినిక్స్ స్మార్ట్ 10 హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ మెరుగైన డ్రాప్ రెసిస్టెంట్ గా ఉంది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS :
ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ Unisoc T7250 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 4GB LPDDR4x ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1 పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 8MP కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 30fps వద్ద 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. Folax AI వాయిస్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్ వంటి అనేక AI ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ఫీచర్లను కలిగి ఉంది.
5000mAh బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. మెరుగైన ఆడియో కోసం DTS సపోర్టుతో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. 4G, బ్లూటూత్, వైఫై, GPS, FM, OTG, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 హ్యాండ్‌సెట్ అల్ట్రాలింక్ ఫీచర్ ను కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలు, పూర్తిగా నెట్‌వర్క్ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫీచర్ ద్వారా రెండు ఇన్ఫినిక్స్ ఫోన్‌ల మధ్య కాలింగ్ కు మాత్రమే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








