Home
Mobile

రూ.6799 కే స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 5000mAh బ్యాటరీ, నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు..!

infinix Smart 10 Smartphone : ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. రూ.6799 ప్రారంభ ధరకే ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. అయితే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా అనేక ఆకట్టుకొనే ఫీచర్‌లను ఈ ఫోన్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. నెట్‌వర్క్‌ లేకున్నా కూడా ఈ ఫోన్‌ నుంచి కాల్స్‌ చేసుకోవచ్చు.

ఇన్పినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ (720 x 1600 పిక్సల్స్‌) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 700 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మన్నికపై ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మరియు 25 వేల డ్రాప్‌ టెస్ట్‌లు పూర్తి చేసినట్లు ఇన్ఫినిక్స్‌ చెబుతోంది.

infinix Smart 10 Smartphone features

ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టా కోర్ Unisoc T7250 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 4GB LPDDR4x ర్యామ్‌, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత XOS 15.1 పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంటుంది. ఈ ఫోన్‌ 30fps వద్ద 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు ప్రో, పొర్ట్రెయిట్ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది.

infinix Smart 10 Smartphone features

ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 40 గంటల కాలింగ్‌ లేదా 100 గంటల మ్యూజిక్‌ కోసం ఉపయోగించుకోవచ్చని ఇన్ఫినిక్స్ చెబుతోంది. Folax AI వాయిస్ అసిస్టెంట్‌తోపాటు డాక్యుమెంట్‌ అసిస్టెంట్‌, రైటింగ్ అసిస్టెంట్ వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంది.

సిగ్నల్‌ లేకపోయినా కాల్స్ :
ఈ ఫోన్‌ అల్ట్రాలింక్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా నెట్‌వర్క్‌ తక్కువగా ఉన్న ప్రాంతాలు మరియు పూర్తిగా నెట్‌వర్క్ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్‌ చేసుకోవచ్చు. అయితే ఇన్ఫినిక్స్ టూ ఇన్ఫినిక్స్‌ ఫోన్‌ల మధ్య మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

infinix Smart 10 Smartphone features

ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు మెరుగైన ఆడియో కోసం DTS సపోర్టుతో డ్యూయల్‌ స్పీకర్‌లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా 4G, బ్లూటూత్‌, వైఫై, GPS, FM, OTG, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Take a Poll

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6799 గా ఉంది. ఈ ఫోన్‌ ఆగస్టు 2 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఆఫ్‌లైన్‌ లో కొనుగోలు చేయవవచ్చు. ఈ ఫోన్ ఐరిస్‌ బ్లూ, స్లీక్‌ బ్లాక్‌, టైటానియం సిల్వర్‌, ట్విలైట్‌ గోల్డ్‌ వంటి కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
infinix Smart 10 Smartphone launched in india at Rs6799 Price handset supports untralink feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X