రూ.6799 ధరకే నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ చేసుకొనే అవకాశం ఉన్న స్మార్ట్‌ఫోన్!
ఇన్ఫినిక్స్ ఇటీవల కాలంలో ఎంట్రీ, బడ్జెట్ ధరలో అనేక మోడల్స్ ను లాంచ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్స్‌లో అనేక స్మార్ట్‌ఫోన్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గత నెలలో విడుదల అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ (Infinix Smart 10 Smartphone) ప్రస్తుతం రూ.7 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ ఈ ఫోన్ నుంచి కాల్స్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 OS తోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్ లను కలిగి ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
ధర, డిస్కౌంట్ వివరాలు :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6799 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ లో ఫ్లిప్‌కార్ట్ యాక్సెక్ బ్యాంకు క్రిడెట్ కార్డు, ఫ్లిప్‌కార్ట్ SBI బ్యాంకు క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ను అందిస్తోంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ హ్యండ్‌సెట్ డ్రాప్ రెసిస్టెన్స్ సపోర్టును కూడా కలిగి ఉంది.
చిప్‌సెట్, OS, ఏఐ ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ Unisoc T7250 SoC చిప్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ చిప్ సెట్ 4GB LPDDR4x ర్యామ్, 64GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1 ను కలిగి ఉంది. ఈ ఫోన్ Folax AI వాయిస్ అసిస్టెంట్, డాక్యుమెంట్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
5000mAh బ్యాటరీ, నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ :
కెమెరా విభాగం పరంగా 8MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 15W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ అల్ట్రా లింక్ ఫీచర్ ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా నెట్ వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు పూర్తిగా నెట్ వర్క్ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కాల్స్ చేసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ డివైజ్ ల మధ్య మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది.
నాలుగు కలర్ వేరియంట్స్ :
కనెక్టివిటీ పరంగా 4G, WiFi, బ్లూటూత్, GPS, FM, OTG, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం DTS సపోర్టుతో డ్యూయల్ స్పీకర్ లను అమర్చారు. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. టైటానియం సిల్వర్, ఐరిస్ బ్లూ, స్లీక్ బ్లాక్, ట్విలైట్ గోల్డ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications