రెడ్‌మి 5ఎకి అసలైన సవాల్ విసిరిన స్మార్ట్‌2

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.

|

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ బడ్జెట్‌ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్ మోటో సీ ప్లస్, షియోమి రెడ్‌మి 5ఎని సవాల్ చేస్తూ ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. 'స్మార్ట్‌2' పేరుతో తీసుకొచ్చిన ఈ ఎంట్రీ లెవల్‌ మొబైల్‌ ధరను రూ.5,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ధర శ్రేణిలో షామీ విడుదల చేసిన రెడ్‌మి5ఏకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫినిక్స్‌ గట్టి పోటీని ఇస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

 

ఆధార్‌పై సారీ చెప్పిన గూగుల్, అసలేమైంది !ఆధార్‌పై సారీ చెప్పిన గూగుల్, అసలేమైంది !

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 ఫీచర్లు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్) ఫేస్ అన్లాక్, డ్యుయల్ 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

ర్యామ్‌

ర్యామ్‌

2జీబీ ర్యామ్‌/ 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌/ 32జీబీ అంతర్గత మెమొరీతో రానుంది. మైక్రో ఎస్డీ సహాయంతో 128జీబీ వరకూ మెమొరీని పెంచుకోవచ్చు.

5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
 

5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే

5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ 18:9 ఫుల్‌వ్యూ డిస్‌ప్లేతో రానుంది. ఆండ్రాయిడ్‌ 8.1పై పనిచేస్తుంది. క్వాడ్‌కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ6739 ప్రాసెసర్‌ను దీనిలో అమర్చారు.

కెమెరా

కెమెరా

13మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, ముందువైపు 8మెగాపిక్సెల్‌ కెమెరాను అమర్చారు.ఈ ఫోన్లో ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్ సదుపాయం కల్పించారు.

ఫేస్ అన్లాక్

ఫేస్ అన్లాక్

ఈ ఫోన్లో ఫింగర్ప్రింట్ సెన్సార్ లేదు. కానీ ఫేస్ అన్లాక్ సదుపాయం లభిస్తోంది. దీని వల్ల ఫోన్ను కేవలం 0.3 సెకన్ల వ్యవధిలోనే ముందు కెమెరాతో అన్లాక్ చేసుకోవచ్చు.

4జీ వీవోఎల్టీ

4జీ వీవోఎల్టీ

ఈ ఫోన్ లో మెమొరీ కార్డు కొరకు డెడికేటెడ్ స్లాట్ ను అమర్చండి. ఈ ఫోన్లో డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ సదుపాయం ఏర్పాటు చేసింది.3050 ఎంఏహెచ్‌ బ్యాటరీ స్టాండ్‌బై మోడ్‌లో 21రోజుల సుదీర్ఘ బ్యాటరీలైఫ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 21 గంటల 4జీ టాక్‌టైమ్‌, 81 గంటల పాటు మ్యూజిక్‌ను వినవచ్చని పేర్కొంది.

ధర

ధర

ఈ ఫోన్ రూ .5,999, రూ .6,999 ధరలకు వినియోగదారులకు ఫ్లిప్కార్ట్ సైట్లో ఈ నెల 10 వ తేదీ నుంచి లభ్యం కానుంది. బోర్డియాక్స్‌ , రెడ్‌, సిటీ బ్లూ, శాండ్‌స్టోన్‌ బ్లాక్‌, సెరెనీ గోల్డ్‌ రంగుల్లో ఇది లభించనుంది.

Best Mobiles in India

English summary
Infinix Smart 2 launched in India for Rs 5,999 to take on Redmi 5A, Moto C Plus more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X