6,000mAh బ్యాటరీ, 6.82-inch డిస్ప్లే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సేల్ నేడే!!

|

ఇన్ఫినిక్స్ సంస్థ ఇండియాలో ఇటీవల బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు నేడు ఫ్లాష్ సేల్ పద్దతిలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12PM నుండి మొదలుకానున్నాయి. 6,000 mAh అతి పెద్ద బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా మరియు 6.82-అంగుళాల అతి పెద్ద డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగి ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్ ఆఫర్స్ వివరాలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్ ఆఫర్స్ వివరాలు

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసారు. 3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో లభించే ఫోన్ యొక్క ధర రూ.7,999. ఫ్లిప్‌కార్ట్‌లో దీని కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నాయి. ఇందులో నో-కాస్ట్ EMI, 6 నెలల గూగుల్ వన్ ట్రయల్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు మీద 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా రుపే డెబిట్ కార్డ్ వినియోగదారులకు రూ.75 తగ్గింపును పొందవచ్చు.

Also Read:Xiaomi కొత్త స్మార్ట్ టీవీ Mi TV 4A హారిజోన్ ఎడిషన్ లాంచ్!!! ధర కూడా తక్కువే...Also Read:Xiaomi కొత్త స్మార్ట్ టీవీ Mi TV 4A హారిజోన్ ఎడిషన్ లాంచ్!!! ధర కూడా తక్కువే...

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేసిన ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో A52 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ స్లాట్‌లను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని మరింత ఎక్కువ విస్తరించవచ్చు. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.82-అంగుళాల HD + IPS డిస్ప్లేని 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ వారీగా ఇది ఇన్ఫినిక్స్ కస్టమ్ XOS 6.2 తో ఆండ్రాయిడ్10 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ ఫీచర్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ ఫీచర్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక ఛార్జీతో 38 గంటల టాక్‌టైమ్ మరియు 23 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదు. ఇమేజింగ్ విషయానికి వస్తే ఫోన్ ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది వాటర్‌డ్రాప్ నాచ్ లోపల అమర్చబడి ఉంటుంది. అలాగే ఫోన్ వెనుకవైపున డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో  13-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉన్నాయి. వెనుక కెమెరాలు AI 3D బ్యూటీ, AI HDR, AR అనిమోజీ, ఆటో సీన్ డిటెక్షన్ మరియు పనోరమా వంటి లక్షణాలకు మద్దతు ఇస్తాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Infinix Smart 4 Plus Budget Smartphone Sale Starts Today in India Via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X