పొరపాటున కిందపడినా డ్యామేజీ కానీ స్మార్ట్‌ఫోన్.. మరో నాలుగు రోజుల్లో విడుదల..!
ఇన్ఫినిక్స్ నుంచి త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD పేరుతో (Infinix smart 9 HD Smartphone) జనవరి 28 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఎక్కువకాలం మన్నిక వస్తుందని.. ఇందుకు సంబంధించి అనేక పరీక్షలు చేసినట్లు తెలిపింది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD స్మార్ట్‌ఫోన్ పై 2,50,000 డ్రాప్ టెస్ట్‌లు చేసినట్లు తెలిపింది. దీని ఆధారంగా ఈ ఫోన్ మెరుగైన బిల్ట్ క్వాలిటీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ 6 వైపులా కూడా టెస్ట్‌లు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రిసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ధ్రువీకరిస్తోంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ మింట్ గ్రీన్, కోరల్ గోల్డ్, మెటాలిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది.
టిప్‌స్టర్ సుదన్సు అంభోర్ ఈ ఇన్ఫినిక్స్ హ్యాండ్‌సెట్ కీలక వివరాలను లీక్ చేశారు. దీని ఆధారంగా ఈ ఫోన్ స్వ్కేర్ కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు LED ఫ్లాష్ యూనిట్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ మల్టీ లేయర్ గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. DTS ఆడియో సపోర్టుతో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ ఫోన్ ఎంత ధరకు లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు ఎటువంటి స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD.. 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,999 కే విడుదల అయింది. క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
అయితే స్మార్ట్ 8 HD ఫోన్ కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. స్మార్ట్ 8 HD ఫోన్.. 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Unisoc T606 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. 13MP డ్యూయల్ AI కెమెరాలు సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 HD ఫోన్ ఈ నెల 28 వ తేదీన లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే రన్ అవుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. అయితే ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా ఈఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టెస్టింగ్ వివరాలు కూడా ఈ మైక్రో సైట్లో చూడవచ్చు.


Click it and Unblock the Notifications








