Home
Mobile

ధర రూ.6,199 కే 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!

ఇన్ఫినిక్స్ భారత్‌ మార్కెట్‌ లో ఇవాళ ఎంట్రీ లెవల్‌ ధరలో ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ 9 HD స్మార్ట్‌ఫోన్‌ ను (Infinix Smart 9 HD Smartphone) లాంచ్‌ చేసింది. అయితే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా ఆకట్టుకొనే డిజైన్‌ సహా మెరుగైన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు డైనమిక్‌ బార్‌ తో విడుదల అయింది. మరియు స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా బిల్ట్‌ క్వాలిటీని కలిగి ఉంది.

దృఢమైన ఫోన్‌ :
ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ 9 HD ఫోన్‌ 2,50,000 డ్రాప్ టెస్ట్‌ లు, 200 లకు పైగా క్వాలిటీ డ్యూరబిలిటీ టెస్ట్‌ లు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఫలితంగా పొరపాటున ఫోన్‌ కింద పడిన భారీగా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఫోన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.

Infinix Smart 9 HD Smartphone launched

ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ 9 HD స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ ఇన్ఫినిక్స్‌ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల (1600*720 పిక్సల్స్‌) HD+ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డైనమిక్‌ బార్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ నోటిఫికేషన్‌లను అందిస్తుంది.

ప్రాసెసర్‌, OS :
ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 గో ఆధారిత XOS 14 పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్‌ హీలియో G50 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 3GB LPDDR4X ర్యామ్‌ మరియు 64GB eMMC 5.1 స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పొడిగించే అవకాశం ఉంది.

Infinix Smart 9 HD Smartphone launched

ధర, సేల్‌ వివరాలు :
ఇన్ఫినిక్స్‌ స్మార్ట్‌ 9 HD స్మార్ట్‌ఫోన్‌ 3GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.6,699 గా ఉంది. ఈ ఫోన్ సేల్‌ ఫిబ్రవరి 4 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

డిస్కౌంట్ ఆఫర్‌ :
ప్రారంభ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్‌ ధర రూ.6,199 గా ఉంటుంది. ఈ ఫోన్ మింట్ గ్రీన్‌, మెటాలిక్‌ బ్లాక్‌, నియో టైటానియం, కోరల్‌ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. 10W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రెండు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌ తో 13MP ప్రైమరీ కెమెరా, సహా మరో లెన్స్‌ ను అమర్చి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌ ను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 4G VoLTE, బ్లూటూత్‌ 5,0, వైఫై 802, USB-C, 3.5mm ఆడియో జాక్‌ ను కలిగి ఉంటుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం DTS తో కూడిన స్టీరియో స్పీకర్‌లను అమర్చారు. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌గా ఉంది. ఈ ఫోన్‌ బరువు 188 గ్రాములుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X