అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరో 5, ధర రూ. 17,999

Written By:

హాంగ్‌కాంగ్ మొబైల్ దిగ్గజం ఇన్ఫినిక్స్ తన కొత్త ఫోన్ ఇన్ఫినిక్స్ జీరో 5ను ఈ రోజు మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో హాట్ 4 ప్రొ, నోట్ 4 పేరిట రెండు ఆండ్రాయిడ్ ఫోన్లను లాంచ్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ జీరో 5ను రిలీజ్ చేసింది. 6జిబి ర్యామ్ తో పాటు అదిరిపోయే కెమెరాలు ఈఫోన్ కి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని కంపెనీ తెలిపింది.

అభిమానుల కళ్లన్నీ ఈ ఫోన్ వైపే, అయిదు నగరాల్లో లైవ్ షో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్ఫినిక్స్ జీరో 5 ఫీచర్లు..

5.98 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

కెమెరా స్పెషాలిటీ

వెనుక భాగంలో 12, 13 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలు ఉంటాయి. అందులో ఒక కెమెరాతో 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ వస్తుంది. దీంతో ఫొటోలు, వీడియోలు నాణ్యంగా తీసుకోవచ్చు. ఇక ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో నచ్చిన విధంగా సెల్ఫీలు దిగవచ్చు.

బాడీ

యూని బాడీ మెటల్‌తో ప్రీమియం క్వాలిటీ లుక్ కనిపిస్తుంది. అలాగే ఇంకో ఫీచర్ కింద డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉంది.

64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో

ఈ ఫోన్ 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కాగా అవి వరుసగా రూ.17,999, రూ.19,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Infinix Zero 5, Zero 5 Pro With 6GB RAM, Dual Rear Cameras Launched: Price, Specifications Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot