12 మినిట్స్‌లో, ఫుల్ ఛార్జ్‌: 180W ఛార్జింగ్ స‌పోర్ట్‌తో Infinix కొత్త ఫోన్ లాంచ్‌!

|

ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Infinix, గ్లోబ‌ల్ మార్కెట్లో త‌న‌దైన శైలిలో ఉత్ప‌త్తుల్ని విస్త‌రిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ‌గా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన ఈ సంస్థ, ఇప్పుడు నెమ్మ‌దిగా ఫ్లాగ్‌షిప్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. చైనాకు చెందిన ఈ కంపెనీ తాజాగా Infinix Zero Ultra మొబైల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ అనేక గొప్ప ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీ పేర్కొంది.

 
12 మినిట్స్‌లో, ఫుల్ ఛార్జ్‌: 180W ఛార్జింగ్ స‌పోర్ట్‌తో Infinix కొత్త

ఈ Infinix Zero Ultra మొబైల్ క‌ర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే క‌లిగి ఉంది. అన్నింటికంటే మించి ఇందులో ప్ర‌ధాన ప్ర‌త్యేకత ఏంటంటే.. దీనికి 200MP ప్రైమరీ సెన్సార్ కెమెరా అందిస్తున్నారు. ఇంకా ప్రాసెస‌ర్ విష‌యానికొస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 5G ప్రాసెసర్ అందిస్తున్నారు. ఇతర ఫీచర్లతో పాటు 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్‌కు ప్యాక్ చేయబడింది. ఇప్పుడు దీని ధ‌ర మ‌రియు ఇంకా పూర్తి స్పెసిఫికేష‌న్ల గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

Infinix Zero Ultra మొబైల్ ధర, లభ్యత:
Infinix Zero Ultra మొబైల్ ధర $520 (సుమారు ₹42,447) గా కంపెనీ నిర్ణ‌యించింది. ఇది 8GB RAM + 256GB అంతర్గత నిల్వతో ఒకే వేరియంట్‌లో అందించబడుతుంది. ఈ పరికరం కాస్‌లైట్ సిల్వర్ మరియు జెనెసిస్ నోయిర్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక‌పోతే, భార‌త్‌లో ఈ Infinix Zero Ultra మొబైల్ లాంచ్‌కు సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌లేదు.

Infinix Zero Ultra ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
Infinix Zero Ultra మొబైల్ స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. దీనికి ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే అందిస్తున్నారు. ఇది 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ స్లిమ్ బెజెల్స్‌తో వస్తుంది, త‌ద్వారా ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. Infinix Zero Ultra మొబైల్ 6nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై నిర్మించిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 5G సామర్థ్యం గల అత్యుత్త‌మ శ్రేణి ప్రాసెసర్. ఈ ప్రాసెస‌ర్ Realme 9 Pro+, Xiaomi 11i, Realme Narzo 50 Pro 5G మరియు Vivo V23 5G వంటి ఇతర డివైజ్‌ల‌లో కూడా ఉప‌యోగించ‌డం జ‌రిగింది.

12 మినిట్స్‌లో, ఫుల్ ఛార్జ్‌: 180W ఛార్జింగ్ స‌పోర్ట్‌తో Infinix కొత్త

Infinix Zero Ultra మొబైల్ 8GB RAM మరియు 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో అమర్చబడింది. దాని కెమెరాల విష‌యానికొస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో OISతో కూడిన 200MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 32MP సెన్సార్ నిర్వహిస్తుంది, ఇది ముందు భాగంలో పంచ్-హోల్ కెమెరా కటౌట్‌లో ఉంటుంది.

Infinix Zero Ultra యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6 మరియు USB టైప్-C ఉన్నాయి. ఇది ఛార్జ్ విష‌యానికొస్తే.. 4,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 180W GaN ఫాస్ట్ ఛార్జర్ ద్వారా దీనిని ఛార్జ్ చేయవచ్చు, ఇది కేవలం 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా XOS 12లో రన్ అవుతుంది.

 

Infinix Zero Ultra మొబైల్ ధర $520 (సుమారు ₹42,447) గా కంపెనీ నిర్ణ‌యించింది. ఇది 8GB RAM + 256GB అంతర్గత నిల్వతో ఒకే వేరియంట్‌లో అందించబడుతుంది. ఈ పరికరం కాస్‌లైట్ సిల్వర్ మరియు జెనెసిస్ నోయిర్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక‌పోతే, భార‌త్‌లో ఈ Infinix Zero Ultra మొబైల్ లాంచ్‌కు సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌లేదు.

Best Mobiles in India

English summary
Infinix Zero Ultra flagship smartphone launched globally with 200MP sensor

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X