ఇన్‌ఫోకస్ నుంచి ఆధార్ బ్యాంకింగ్ ఫోన్!
బింగో 20 (ఎమ్425) పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఐరిస్ స్కానర్ ఆధారంగా యూజర్‌కు సంబంధించిన బయో మెట్రిక్స్‌ను ధృవీకరించగలదు.
భవిష్యత్ బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగపడేవిధంగా ప్రత్యేకమైన ఆధార్ ఎనేబుల్ట్ స్మార్ట్‌ఫోన్‌ను InFocus కంపెనీ సోమవారం మార్కెట్లో లాంచ్ చేసింది. బింగో 20 (ఎమ్425) పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఐరిస్ స్కానర్ ఆధారంగా యూజర్‌కు సంబంధించిన బయో మెట్రిక్స్‌ను ధృవీకరించగలదు. ఫోన్ ధర రూ.12,000 వరకు ఉండవచ్చని సమాచారం. 2017లో మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం..

Read More : 2017లో రాబోతున్న 5 నోకియా ఫోన్‌లు
ఐరిస్ స్కానింగ్ సామర్థ్యంతో వస్తోన్న బింగో 20 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 4.5 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ SC9830 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆధార్ బేసిడ్ బయోమెట్రిక్ ప్రామాణికరణతో వస్తోన్న ఈ ఫోన్ ద్వారా బ్యాంకింగ్ అవసరాలతో పాటు చెల్లింపులు, ఈ-గవర్నెన్స్, పాస్ పోర్ట్, ట్యాక్సేషన్, హెల్త్ కేర్ వంటి సేవలను పొందే వీలుంటుంది.


Click it and Unblock the Notifications








