చైనా ఫోన్‌‌లకు షాకిచ్చిన InFocus, రూ.6,999కే 5000mAh బ్యాటరీ ఫోన్

అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ InFocus చైనా బ్రాండ్‌లకు ధీటుగా ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. InFocus Turbo 5 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.6,999. జూలై 4 నుంచి అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ దొరుకుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5000mAh బ్యాటరీతో..

5000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్ పై రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

రెండు వేరియంట్‌లలో...

రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999.

InFocus Turbo 5 స్పెసిఫికేషన్స్...

5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720 x 1280పిక్సల్స్), 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆన్ టాప్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25Ghz మీడియాటెక్ MT6737 సాక్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

InFocus Turbo 5 స్పెసిఫికేషన్స్...

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్). ఫోన్ బరువు 165 గ్రాములు, మందం 9.0 మిల్లీ మీటర్లు, అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్ (మోచా గోల్డ్, ప్యూర్ గోల్డ్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
InFocus Turbo 5 With a Massive 5000mAh Battery Launched at Rs.6,999 in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot