Home
Mobile

Infocus నుంచి మరో ఫోన్ వచ్చేస్తోంది

2జీబి ర్యామ్ వర్షన్ ధర రూ.6,999. 3జీబి ర్యామ్ వర్షన్ ధర రూ.7,999..

By Sivanjaneyulu Bommu

అమెరికన్ బ్రాండ్ Infocus, ఇండియన్ మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది.Turbo 5 Turbo 5 Plus పేరుతో విడుదల చేయబోతోన్న ఈ ఫోన్‌కు సంబంధించి ప్రచార కార్యక్రమాలను ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా కంపెనీ ప్రారంభించింది.

Infocus నుంచి మరో ఫోన్ వచ్చేస్తోంది

సెప్టంబర్ 13న విడుదల కాబోతోన్న ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. Turbo 5 Plusకు ముందు వర్షన్ అయిన Turbo 5 ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంచటం జరిగింది. 2జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.6,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.7,999.

ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... 5.2 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్, Mali T720 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 mAh బ్యాటరీ, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్ 4.0, జీపీఎస్/ ఏజీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ 2.0, ఫోన్ బరువు 163 గ్రాములు, చుట్టుకొలత 150 x 74 x 9.0మిల్లీ మీటర్లు.

Best Mobiles in India

English summary
Infocus Turbo 5 Plus launching soon in India. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X