రెడ్‌మి 4 vs ఇన్‌ఫోకస్ టర్బో 5

అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇన్‌ఫోకస్, Turbo 5 పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఏకంగా 5000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.6,999. సరిగ్గా Redmi 4 తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్, హెచ్‌డి డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ రెండు ఫోన్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటల్ బాడీతో...

మెటల్ బాడీతో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ స్కానర్‌లను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది.

డిస్‌ప్లేల మధ్య స్వల్ప తేడా..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఇన్‌ఫోకస్ టర్బో 5 ఫోన్, 5.2 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1280x720పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ప్లానల్‌తో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 ఫోన్ 5 అంగుళాల డిస్‌ప్లే(రిసల్యూషన్ కెపాసిటీ 1280x720పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ప్లానల్‌తో వస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి.

ప్రాసెసర్ విషయంలో ఇన్‌ఫోకస్ తేలిపోయింది..

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 4 ముందు ఇన్‌ఫోకస్ టర్బో 5 ఫోన్ తేలిపోయింది. ఇన్‌ఫోకస్ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 64 బిట్ ప్రాసెసర్‌తో పోలిస్తే రెడ్‌మి 4లో పొందుపరిచన ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ మెరుగైన పనితీరును ఆఫర్ చేస్తుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే...

ఇన్‌ఫోకస్ టర్బో 5 ఫోన్ 2జీబి ఇంకా 3జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 16జీబి అలానే 32జీబి వేరియంట్‌లలో పొందువచ్చు. ఇదే సమయంలో రెడ్‌మి 4 2జీబి/3జీబి/4జీబి ర్యామ్ వర్షన్‌లతో పాటు 16జీబి/32జీబి/64జీబి స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

కెమెరా స్పెక్స్...

కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో ఫిట్ అయి ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

ఇన్‌ఫోకస్ టర్బో 5 ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశం ఉంది.

బ్యాటరీ విషయంలో ఇన్‌ఫోకస్ భేష్...

ఈ రెండు ఫోన్‌‍లు 4G VoLTE ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 4 ఫోన్ 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోండగా, ఇన్‌ఫోకస్ టర్బో 5 ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

రెడ్‌మి 4 ధర...

రెడ్‌మి 4 ఫోన్ ఇప్పటికే మార్కెట్లో దొరకుతోంది. అమెజాన్ ఇండియా అలానే ఎంఐ.కామ్‌లు ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి. ధరలు విషయానికి వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.8,999. 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.10,999 (ఈ వేరియంట్ ఇంకా మార్కెట్లో రిలీజ్ కావల్సి ఉంది).

రూ.6,999కే ఇన్‌ఫోకస్ టర్బో 5 ఫోన్...

ఇన్‌ఫోకస్ టర్బో 5 ఫోన్ జూలై 4నుంచి మార్కెట్లో దొరుకుతుంది. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.7,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
InFocus Turbo 5 vs Xiaomi Redmi 4. Which one is the Best Budget Smartphone?. Read Full Details in Gizbot Telugu..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot