ఇన్‌ఫోకస్ విజన్ 3 ప్రో.. రివ్యూ చూస్తారా ?

Posted By: M KRISHNA ADITHYA

ఇన్‌ఫోకస్ నుంచి నూతన ఫోన్ 3 ప్రో విడుదల మార్కెట్లో విడుదలకు సిద్ధమైంది. రెడ్ మీ నోట్ 5 ప్రో, జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 మోడల్స్ కు పోటీ ఇచ్చేలా రూపొందించిన ఈ ఫోన్ పూర్తి స్థాయి ఆల్ స్క్రీన్ మోడల్ గా అడుగు పెట్టింది. అసుస్, జియోమీ ఇప్పటికే 18:9 డిస్ ప్లే తో మార్కెట్లో అడుగు పెట్టగా, ఇప్పుడు ఇన్ ఫోకస్ సైతం ఇదే తరహాలో ముందుకు వచ్చింది. దీని ధర రూ.10,999 గా నిర్ణయించగా, ఈ కొత్త ఫోన్ యొక్క బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. అలాగే అక్టా కోర్ మీడియా టెక్ ప్రొసెసర్ ఇందులో వాడుతున్నారు. అయితే ఇది అంత సమర్థత విషయంలో మాత్రం నిపుణులు పలు సందేహాలు లేవనెత్తుతున్నారు.

క్రెడిట్ కార్డుల వ్యాపారంలోకి ఆపిల్ కంపెనీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ మరియు డిస్ ప్లే..

విజన్ ప్రో 3 మెటల్ బాడీతో మార్కెట్లోకి రానుంది. అలాగే ప్లాస్టిక్ క్యాప్స్ యాంటెన్నా బ్యాండ్స్ టాప్ మరియు బాటమ్ లో కవర్ చేస్తాయి. అలాగే 5.7-అంగుళాల HD + 2.5D కర్వ్‌డ్ డిస్‌ప్లే అందిస్తున్నారు. అలాగే రేర్ పానెల్ పై డ్యూయల్ కెమెరా అమర్చారు. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అమర్చారు. దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇక వాల్యూమ్ బటన్స్ సిమ్ ట్రే పక్కనే ఉన్నాయి. అలాగే ఆన్‌స్క్రీన్ నేవిగేషన్ బటన్స్ కూడా ఏర్పాటు చేశారు.

ఫీచర్స్ మరయు సాఫ్ట్ వేర్..

ఇక డిస్ ప్లే రిజల్యూషన్ విషయానికి వస్తే 1440X720 గా నిర్ణయించారు. దీని ద్వారా కలర్స్ విషయంలో ఒక కొత్త అనుభూతి లభిస్తుంది. అలాగే మీడియా టెక్ MT6750 ప్రాసెసర్ ను ఇందులో వాడారు. ఫోన్ లో 4GB RAM తో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ పొందవచ్చు. ఈ డివైస్ మిడ్ నైట్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీనితో పాటు మీరు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా పొందవచ్చు.

డ్యూయల్ కెమెరా సెటప్

స్టోరేజ్ ఎక్స్ పాండ్ చేయటానికి MicroSD కార్డ్ స్లాట్ కూడా జతచేశారు, దీని ద్వారా 128GB వరకు మెమరీ స్టోరేజ్ ను విస్తరించవచ్చు. ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఇది 13 మెగాపిక్సెల్ ప్రాథమిక కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కలిగి ఉంది. అలాగే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సల్ కలిగి ఉంది. అలాగే ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ తో డ్యూయల్ సిమ్ సిమ్ స్లాట్, 4 జీ ఎల్ఈటీ, వోల్టే, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్ లు ఉన్నాయి.

 

 

చివరిగా..

ఇన్ ఫోకస్ విజన్ 3 ప్రో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో పాటు గత వెర్షన్ కన్నా పలు మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్ మీ నోట్ 5, జెన్ మాక్స్ ప్రో ఎం1 లతో పోల్చితే ఈ ఫోన్ కి ఆదరణ తక్కువగా లభిస్తోంది. అలాగే ర్యామ్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉండటం మాత్రం ఈ ఫోన్ లో కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
InFocus Vision 3 Pro review: Affordable but not the best More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot