ఇన్ఫోసిస్‌లో 74కి పెరిగిన కరోడ్‌పతుల ఉద్యోగుల జాబితా

By Gizbot Bureau
|

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో 2019-20లో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకుంటున్న కరోడ్‌పతుల జాబితా 74కి పెరిగింది. ఇదే కంపెనీలో అంతకుముందు ఏడాది కోటీశ్వరుల సంఖ్య 60గా ఉంటే కొత్తగా 14 మంది ఈ జాబితాలోకి చేరారు. అధిక వేతన రాబడితో కరోడ్‌పతులుగా ఎదిగిన వారిలో అత్యధికులు వైస్‌- ప్రెసిడెంట్‌, సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నవారే. గతంలో మంజూరు చేసిన షేర్లు ఈ ఏడాది అందిరావడం వాటి విలువ ఆధారంగా వార్షిక వేతన రాబడి పెరిగింది. గత ఏడాది భారత్‌లో ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సగటు వేతన పెంపు 7.3 శాతంగా ఉంది.

సీఈఓ సలిల్‌ పరేఖ్‌

సీఈఓ సలిల్‌ పరేఖ్‌

2019-20లో ఇన్ఫోసిస్‌ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ మొత్తం పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో జీతంతో కలుపుకుని పరిహారం రూ .16.85 కోట్లు కాగా, స్టాక్‌ ఆప్షన్ల మార్గంలో రూ .17.04 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద రూ. 38 లక్షలు ఈయనకు చెల్లించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. భారత్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఐటీ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ కావడం విశేషం. 

ఇన్ఫోసిస్‌ చీఫ్‌ నందన్‌ నిలేకాని లేఖ

ఇన్ఫోసిస్‌ చీఫ్‌ నందన్‌ నిలేకాని లేఖ

మున్ముందు సవాళ్లతో కూడిన సమయాన్ని ఎదుర్కోవడం నిజమైన పరీక్షని, సవాళ్లను సాంకేతికతో దీటుగా ఎదుర్కొనేలా కార్యోన్ముఖులు కావాలని వాటాదారులకు రాసిన లేఖలో ఇన్ఫోసిస్‌ చీఫ్‌ నందన్‌ నిలేకాని పేర్కొన్నారు.

రూ.3,291 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు

రూ.3,291 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు

ఇన్ఫోసిస్‌ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2020గానూ వివిధ కంపెనీల్లో రూ.3,291 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ వార్షిక నివేదికలు నిర్ధారించాయి. తన అనబంధ సంస్థ ఇన్ఫోసిస్‌ నోవా హోల్డింగ్స్‌ గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా ఆధారిత కంపెనీ సింప్లస్‌ను రూ.1,890 కోట్లకు సొంతం చేసుకుంది. మరో అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్‌ కన్సల్టింగ్‌ పీటీఈ ఎఫ్‌వై 2020 ఏప్రిల్‌లో జపాన్‌కు చెందిన హిపస్‌లో 80శాతం వాటాను రూ.206 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ ఏడాది లాభాలు తగ్గే అవకాశం 

ఈ ఏడాది లాభాలు తగ్గే అవకాశం 

ఇదే అనుబంధ సంస్థ ఏబీఎన్‌ ఏఎంఆర్‌ బ్యాంక్‌ సబ్సీడరీ సంస్థ స్టార్టర్‌లో 75 శాతం వాటాను రూ. 1,195 కోట్లకు చేజిక్కించుకున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో తెలిపింది. ఇక మార్చి 31 2020 నాటికి కంపెనీ 23 ప్రత్యక్ష, 52 అనుబంధ సంస్థలను కలిగి ఉంది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో పలు ప్రాజెక్ట్‌ల రద్దు, దివాలా, క్లయింట్ల నుంచి ధరల ఒత్తిడి తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021)లో కంపెనీ లాభదాయకత, వృ‍ద్ది క్షీణించవచ్చని ఇన్ఫోసిస్‌ తెలిపింది.

నారాయణ మూర్తి ఆందోళన

నారాయణ మూర్తి ఆందోళన

లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 ప్రతిష్టంభన ఎక్కువ కాలం కొనసాగితే అనధికారిక లేదా అసంఘటిత రంగంలోని కార్మికులు చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతారన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సంక్రమణకు గురయ్యే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని ప్రారంభించే వీలు కల్పించాలని ఆయన అన్నారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయన్నారు.

Best Mobiles in India

English summary
Infosys had 74 crorepatis in 2020 fiscal, no promotion for leaders

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X