2016లో లాంచ్ అయిన క్రియేటివ్ స్మార్ట్‌ఫోన్‌లు

క్రియేటివ్ ఫీచర్లతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచ మార్కెట్లు దాసోహమంటున్నాయి. యాపిల్, సోనీ, సామ్‌సంగ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎల్‌జీ వంటి దిగ్గజ బ్రాండ్‌లు మొదులుకుని లెనోవో, షియోమీ, జియోనీ, హువావీ వంటి చైనా బ్రాండ్‌ల వరకు టాప్-ఎండ్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. క్రియేటివ్ ఫీచర్లతో 2016లో మార్కెట్లో లాంచ్ అయి సరికొత్త ఒరవడికి నాందిపలికిన 6 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా?, ముందుగా ఇవి తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG G5

ఎల్‌జీ జీ5

ఎల్‌జీ కంపెనీ మాడ్యులర్ డిజైన్‌తో రూపొందించిన ఎల్‌జీ జీ5 ఫోన్, ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. సరికొత్త డ్యుయల్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రొఫెషనల్ క్వాలిటీ వైడ్ - యాంగిల్ ఫోటోగ్రఫీని యూజర్లకు చేరువ చేస్తుంది. 5.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 3డీ ఆర్క్ గ్లాస్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే.. క్వాడ్ - కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 2,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

BlackBerry Priv

బ్లాక్‌బెర్రీ ప్రివ్
ప్రత్యేకతలు : స్టాండర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్, ఫిజికల్ కీబోర్డ్, స్లైడ్ అవుట్ కీబోర్డ్

బ్లాక్‌బెర్రీ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ 'ప్రివ్' (Priv)కు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు డ్యుయల్ కర్వు డిస్‌ప్లే ఇంకా ఫిజికల్ స్లైడ్ కీబోర్డ్‌లు ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి

Motorola Moto Z Phones

మోటరోలా మోటో జెడ్ ఫోన్స్

యాపిల్, సామ్‌సంగ్‌లకు ధీటుగా మోటరోలా సరికొత్త ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌పోన్‌లను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చింది. మోటో జెడ్ (Moto Z), మోటో జెడ్ ప్లే (Moto Z Play) మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ సెమీ మాడ్యులర్ కాన్సెప్ట్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ మిన్నంటుతోంది. ఎక్స్‌టర్నల్ మాడ్యుల్స్‌తో వచ్చే ఈ ఫోన్‌లను మాగ్నటిక్ పోర్ట్ సహాయంతో Moto Modsను కనెక్ట్ చేసుకోవచ్చు. మోటో మోడ్స్ పేరుతో పలు రకాల మాడ్యులర్ యాక్సెసరీస్‌ను మోటరోలా ఈ ఫోన్‌ల కోసం ఆఫర్ చేస్తుంది.. వీటితో Moto Z , Moto Z Play ఫోన్‌లను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన మాడ్యులర్ కేసెస్‌తో ఫోన్‌లను ఇన్‌స్టెంట్ పవర్ బ్యాంక్‌లా, సౌండ్ బూస్టర్‌లా, ప్రొజెక్టర్‌లా, అధిక ఫ్లాషెస్‌తో కూడిన కెమెరా లెన్స్‌లా మార్చేసుకోవచ్చు.

 

లెనోవో ఫాబ్ 2 ప్రో

లెనోవో ఫాబ్ 2 ప్రో

స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ అత్యాధునిక 3డీ మోషన్ సెన్సింగ్ ఆధారంగా, గూగుల్ 'ప్రాజెక్ట్ ట్యాంగో' ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ పై రన్ అయ్యే మొదటి స్మార్ట్‌ఫోన్ 'ఫాబ్ 2 ప్రో' (Phab 2 Pro)ను లెనోవో ప్రపంచానికి పరిచయం చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కొలో జరుగుతోన్న టెక్ వరల్డ్ 2016 కాన్ఫిరెన్స్‌లో భాగంగా లెనోవో ఈ ఫోన్'కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

గూగుల్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన ప్రాజెక్ట్ ట్యాంగో ప్లాట్‌ఫామ్.. అడ్వాన్సుడ్ కంప్యూటర్ విజన్, లోతైన సెన్సింగ్ ఇంకా మోషన్ ట్రాకింగ్ సాంకేతికతలను ఉపయోగించుకుని ఆన్ స్ర్కీన్ 3జీ అనుభూతులను సృష్టించగలదు. తద్వారా యూజర్ తన చుట్టూ ఉన్న వాటిని క్షుణ్ణంగా పరీశీలించగలడు. ప్రత్యేకంగా రూపొందించిబడిన హార్డ్‌వేర్ పై పని చేయగలిగే ఈ ట్యాంగో సాఫ్ట్‌వేర్, యూజర్ ప్రతి కదలికను పసిగట్టి అందుకు అనుగుణంగా రియాక్ట్ అవుతుంది. ట్యాంగో ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఫోన్‌లు ప్రదేశాలను సులువుగా గుర్తించగలవు. ట్యాంగో ఫోన్‌లలో ఏర్పాటు చేసే ప్రత్యేకమైన సెన్సార్, గదుల చుట్టుకొలతలను రియల్ టైమ్‌లో క్యాప్చూర్ చేసి 3డీ కొలతలను ఇవ్వగలదు. ఈ చుట్టుకొలతలను సేవ్ చేసుకుని ఫర్నిచర్ లేదా డెకరేషన్ సామాగ్రిని కొనుగోలు చేసేటపుడు ఉపయోగించుకోవచ్చు.

 

Xiaomi Mi Mix

షియోమీ ఎంఐ మిక్స్

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ Mi Mix పేరుతో సరికొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే లభ్యమయ్యే ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఫోన్‌ను ఫ్రెంచ్ డిజైనర్ ఫిలప్ స్టార్క్ సహకారంతో షియోమీ అభివృద్థి చేసింది. ఎడ్జ్‌లెస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 4జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నట్ స్టోరేజ్. ధర రూ.34,500(చైనా కరెన్సీలో), రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ధర రూ.39,500 (చైనా కరెన్సీలో). Mi Mix ఫోన్‌కు కర్వుడ్ ఎడ్జెస్‌తో వచ్చిన ఎడ్జ్-లెస్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 6జీబి ర్యామ్ వేరియంట్‌తో వచ్చే ఫోన్‌కు సంబంధించి కెమెరా లెన్స్, ఇంకా పింగర్ ప్రింట్ సెన్సార్ భాగాల్లో 18 క్యారట్ గోల్డ్ ఫినిషింగ్‌‌ను పొందుపరిచారు.

 

Huawei Honor Magic

షియోమీ తరహాలోనే హువావే కూడా ఓ సరికొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ చేసింది. Mi Mix ఫోన్ తరహాలోనే ఈ హ్యాండ్‌సెట్‌లో కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో వస్తోన్నఈ ఫోన్ లోకేషన్ ఆధారంగా మీ పనులను చక్కబెడుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Innovative Smartphones Launched in 2016. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot