వాళ్లిద్దరి మధ్య ఒప్పందం జరిగిందా..?

By Super
|

వాళ్లిద్దరి మధ్య ఒప్పందం జరిగిందా..?


చిప్ మేకర్ ఇంటెల్, సెర్చ్ ఇంజన్ గుగూల్ మధ్య కొత్త ఒప్పందం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను పొందుపరిచే విషయమై ఈ సంస్థల మధ్య చర్చలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రధామకంలో ‘లావా జోలో ఎక్స్900’పేరతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ

చిప్ తయారీ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇంటెల్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌డేట్‌కు సంబంధించి ఏవిధమైన అధికారిక సమాచారం లేదు. స్మార్ట్‌ఫోన్‌ల పరిశ్రమలోకి ఆలస్యంగా అడుగుపెట్టిన ఇంటెల్ ఆ విభాగంలో ఆది నుంచి రాణిస్తున్న ఎన్-విడియా, క్వాల్కమ్, సామ్‌సంగ్, టెక్నాస్

 

ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి ప్రముఖ చిప్ తయారీ సంస్థల నుంచి పోటీను ఎదుర్కొంటుంది.

ఇంటెల్ ప్రాసెసర్ ఆధారితంగా పని చేసే ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ను లావా ప్రవేశపెట్టింది. లావా, ఇంటెల్ సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్ పేరు ‘XOLO X900’. ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

XOLO X900’ కీలక స్పెసిఫికేషన్‌లు..

* 4.3 అంగుళాల హై రిసల్యూషన్ LCD డిస్‌ప్లే,

* ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్, (క్లాక్ సామర్ధ్యం 1.6 GHz),

* ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,

* నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) వ్యవస్థ,

* HSPA + నెట్‌వర్క్ సపోర్ట్,

* హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

* ఇంటెల్ XMM6260 ప్లాట్‌ఫామ్.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X