రాబోయే ఇంటెల్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్!?

Posted By: Staff

రాబోయే ఇంటెల్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్!?

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ విషయంలో చిప్ మేకర్ ఇంటెల్, సెర్చ్ ఇంజన్ గుగూల్‌లు ఓ అవగాహనికి వచ్చినట్లు మార్కెట్ వర్గాల టాక్ . ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను పొందుపరిచే అంశమే వీటి మధ్య చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇంటెల్ తొలి స్మార్ట్‌ఫోన్ ‘లావా జోలో ఎక్స్900’ 2012 ఆరంభంలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటెల్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌డేట్‌కు సంబంధించి ఏవిధమైన అధికారిక సమాచారం లేదు. స్మార్ట్‌ఫోన్‌ల పరిశ్రమలోకి ఆలస్యంగా అడుగుపెట్టిన ఇంటెల్ ఆ విభాగంలో ఆది నుంచి రాణిస్తున్న ఎన్-విడియా, క్వాల్కమ్, సామ్‌సంగ్, టెక్నాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి ప్రముఖ చిప్ తయారీ సంస్థల నుంచి పోటీను ఎదుర్కొంటోంది.

ఇంటెల్‌తో జతకట్టిన లావా, కార్బన్!

కంప్యూటింగ్ పరికరాలు ప్రాసెసింగ్ చిప్‌లను సమకూర్చటంలో ఇంటెల్ సంస్థ క్రీయాశీలక పాత్రపోషిస్తోంది. వ్యాపార సామ్రజ్యాన్ని మరింత విస్తరించుకనే క్రమంలో ఇంటెల్ మొబైల్ ఫోన్‌లకు చిప్‌లను సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఈ నేపధ్యంలో ప్రముఖ మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ లావా, ఇంటెల్‌తో జత కట్టి ఇంటెల్ ప్రాసెసర్ ఆధారిత తొలి స్మార్ట్‌ఫోన్ ‘జోలో900’ను ప్రవేశపెట్టింది. మరో దేశీయ కంపెనీ కార్బన్, ఇంటెల్‌తో జతకట్టింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot