50 లక్షల మందికి డిజిటల్ అక్షరాస్యత: ఇంటెల్ ఇండియా

Posted By:

2015 ముగింపు నాటికి 50 లక్షల మంది భారతీయులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుటమే తమ లక్ష్యమని ఇంటెల్ ఇండియా పేర్కొంది. మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటెల్ ఇండియా తమ ‘డిజిటల్ స్కిల్స్ ఫర్ ఇండియా' ప్రోగ్రామ్‌‌ను ఆవిష్కరించింది.

50 లక్షల మందికి డిజిటల్ అక్షరాస్యత: ఇంటెల్ ఇండియా

ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంటెల్ ఇండియా ‘‘డిజిటల్ స్కిల్స్ ట్రెయినింగ్'' అప్లికేషన్‌ను 5 భారతీయ భాషల్లో అందించనుంది. డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం ఇంకా పరిశుభ్రతకు సంబంధించిన టాపిక్స్ ఈ యాప్‌లో ఉంటాయి. డిసెంబర్ 6 నుంచి ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌‍లో ఉచితంగా లభ్యమవుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంటెల్ ఇండియా 7 ప్రాంతీయ భాషల్లో 1000 పంచాయితీల్లో డిజిటల్ అక్షరాస్యత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Intel India launches digital skills programme. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot