Home
Mobile

ప్రపంచ చరిత్రలో తొలిసారి..?

By Prashanth
Lava


ఇంటెల్ ప్రాసెసర్ ఆధారితంగా పని చేసే ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ను, లావా ఈ వారం విడుదల చెయ్యనుంది. లావా, ఇంటెల్ సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్ పేరు ‘XOLO X900’. ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రదర్శనలో ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

XOLO X900’ కీలక స్పెసిఫికేషన్‌లు..

* 4.3 అంగుళాల హై రిసల్యూషన్ LCD డిస్‌ప్లే,

* ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్, (క్లాక్ సామర్ధ్యం 1.6 GHz),

* ఉత్తమ క్వాలిటీ కెమెరా వ్యవస్థ,

* నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) వ్యవస్థ,

* HSPA + నెట్‌వర్క్ సపోర్ట్,

* హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

* ఇంటెల్ XMM6260 ప్లాట్‌ఫామ్.

ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నప్పటికి త్వరలో 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ కానుంది. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఇంటెల్ ఆటమ్ Z2460 ప్రాసెసర్ పనితీరు పై భారీ అంచనాలు నెలకున్నాయి. 4 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే ఉత్తమ రిసల్యూషన్‌తో కూడిన విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది.

In English

ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా నాణ్యమైన ఫోటోగ్రఫీ ప్రమాణాలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది. అమర్చిన శక్తివంతమైన బ్యాటరీ సుదీర్ఘ బ్యాకప్ నిస్తుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్ఐ అవుట్ సాయంతో హై డెఫినిషన్ స్ర్కీన్‌లకు స్మార్ట్‌ఫోన్‌ను జత చేసుకోవచ్చు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X