డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరింత వివరంగా...

కెమెరా సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకు గిరాకీ పెరుగుతోన్న నేపథ్యంలో డిజిటల్ కెమెరాలకు జనాదరణ తగ్గుతోంది. ఇందుకు కారణం డిజిటల్ కెమెరాల కల్పించలేని సౌకర్యాలు స్మార్ట్‌ఫోన్‌లు కల్పించటమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ కెమెరా ఫోన్‌లకు డిమాండ్..

స్మార్ట్‌ఫోన్‌ కెమెరా క్వాలిటీని మరో ఎత్తుకు తీసుకువెళ్లే క్రమంలో డ్యుయల్ కెమెరా ఫోన్‌లను ఈ మధ్య మార్కెట్లో లాంచ్ చేయటం జరుగోతంది. హెచ్‌టీసీ, హువావే, ఒప్పో, వివో, కూల్‌ప్యాడ్, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు మల్టిపుల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారిన డ్యుయల్ కెమెరా ఫోన్‌ల గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో..

 ఒక కెమెరా లెన్స్ ఉండాల్సిన స్థానంలో రెండు కెమెరా లెన్సులు ఉంటాయి. వీటిలో ఒకటి ప్రైమరీ లెన్స్ కాకా, మరొకటి సెకండరీ లెన్స్. ఫోటోలను చిత్రీకరించుకునే సమయంలో ప్రైమరీ లెన్స్ మేజర్ లిఫ్టింగ్ పై దృష్టిసారిస్తే, సెకండరీ లెన్స్ అదనపు లైట్ ఇంకా ఫీల్డ్ డెప్త్ పై పనిచేస్తుంది.

మొట్టమొదటి డ్యుయల్ కెమెరా ఫోన్‌...

మొట్టమొదటి డ్యుయల్ కెమెరా ఫోన్‌ హెచ్‌టీసీ కంపెనీ డ్యుయల్ కెమెరాలతో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌టీసీ కంపెనీ 2011లో పరిచయం చేసింది. HTC Evo 3D పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో రెండు కెమెరాలు ఉంటాయి. 3డీ ఫోటోలను క్యాప్చురు చేసుకునే విధంగా ఈ డ్యుయల్ కెమెరాను రూపొందించారు.

హెచ్‌టీసీ నుంచి మరో అత్యుత్తమ డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌

2014లో ఇదే హెచ్‌టీసీ కంపెనీ మరో అత్యుత్తమ డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది. HTC one M8 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ HTC Evo 3Dతో పోలిస్తే మన్నికైన కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.

ఫీల్డ్ డెప్త్ బాగుంటుంది..

డ్యుయల్ కెమెరా ద్వారా చిత్రీకరించుకునే ఫోటోల్లో ఫీల్డ్ డెప్త్ అనేది ఎక్కువుగా ఉంటుంది. దీంతో ఫోటోలు చాలా క్లారిటీగా అనిపిస్తాయి.

అవే కీలక పాత్ర పోషిస్తాయి..

డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే ఫోన్‌లలో సెన్సార్ సైజ్, పిక్సల్ సైజ్, అపెర్చుర్లు కీలక పాత్ర పోషిస్తాయి.

2015లో ...

2015లో లెనోవో కంపెనీ Vibe S1 పేరుతో మొదటి డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటుంది. తాజాగా చైనాకు చెందిన Vivo, V5 Plus పేరుతో శక్తివంతమైన డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఏకంగా 20 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది.

ఇప్పుడు, రూ.13,000కే డ్యుయల్ కెమెరా ఫోన్‌

 సంవత్సరం క్రితం వరకు డ్యుయల్ కెమెరా సెటప్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదు రూ.35,000 పైనే ఉండేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో హానర్, కూల్ ప్యాడ్ వంటి కపెనీలు రూ.13,000కే డ్యుయల్ కెమెరా సెటప్‌ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Interesting Facts about Dual Camera Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot