మొబైల్ ప్రాసెసర్లు గురించి మీకు ఎంత వరకు తెలుసు..?

ప్రాసెసర్ అనేది ఫోన్‌కు గుండెకాయ లాంటిది. మీరు ఫోన్‌లో చేసే ప్రతి పని ఈ ప్రాసెసర్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు వేలకువేలు పోసి ఫోన్ కొన్నా కాని ప్రాసెసర్ సరిగా లేదంటే ఆ ఫోన్ సరిగా పనిచేయనట్లే.

మొబైల్  ప్రాసెసర్లు గురించి మీకు ఎంత వరకు తెలుసు..?

ఫోన్‌లో ప్రాసెసర్ సామర్థ్యం తక్కువుగా ఉంటే ప్రాసెసింగ్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇదే సమయంలో ఒత్తిడి తట్టుకోలేక ఫోన్ తరచూ స్ట్రక్ అవుతుంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే ప్రాసెసర్లు వాటి పనితీరును ఒకసారి పరిశీలిద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ కోర్ ప్రాసెసర్..?

డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తో వచ్చే సీపీయూలో ఒక్కో ప్రాసెసర్ రెండేసి కోర్‌లను కలిగి ఉంటుంది. ఈ రెండు ప్రాసెసర్లు ఒకదానితో మరొకొటి సింగిల్ సర్క్యూట్‌లో అనుసంధానమై పనులను చక్కబెడుతుంటాయి.

క్వాడ్-కోర్ ప్రాసెసర్..?

క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం నాలుగు కోర్‌లు ఉంటాయి. ఇవి డేటాను రీడ్ చేస్తూ స్వతంత్రంగా తమ పనులను చక్కబెడుతుంటాయి. ఒక్కో కోర్ ఒక్కో విభాగాన్ని చూసుకుంటుంటుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ లలో నిక్షప్తం చేయబడే ప్రతీ కోర్ ఫోన్ నిర్ధేశించిన ఆదేశాలను పూచా తప్పకుండా అమలు చేస్తూ సమాంతర ప్రాసెసింగ్‌ను చేపడతాయి.

హెక్సా-కోర్ ప్రాసెసర్..?

హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం 6 కోర్‌లు నిక్షిప్తమై ఉంటాయి. డ్యుయల్ కోర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్‌లతో పోలిస్తే హెక్సాకోర్ ప్రాసెసర్లు మరింత వేగంగా స్పందించగలవు. ఈ చిప్‌సెట్‌లలో ఓ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేయటం జరుగుతుంది.

ఆక్టా-కోర్ ప్రాసెసర్..?

ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం 8 కోర్‌లు నిక్షిప్తమై ఉంటాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌లతో పోలిస్తే 200% వేగంతో ఇవి స్పందిస్తాయి. ఆక్టా కోర్ చిప్‌సెట్‌లలో రెండు క్వాడ్-కోర్ ప్రాసెసర్‌లను ఉపయోగించటం జరుగుతుంది. ప్రాసెసర్‌లలో నిక్షప్తం చేయబడే ప్రతీ కోర్ ఫోన్ నిర్ధేశించిన ఆదేశాలను పూచా తప్పకుండా అమలు చేస్తూ సిస్టం వేగాన్ని మరింతగా పెంచుతాయి.

డెకా-కోర్ ప్రాసెసర్..?

డెకా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం 10 కోర్‌లు నిక్షిప్తమై ఉంటాయి. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పోలిస్తే మరింత వేగంగా ఈ ప్రాసెసర్ స్పందిచగలదు. డెకా-కోర్ ప్రాసెసర్‌ మరింత ఖరీదైనది కావటంతో పలు హై-ఎండ్ ఫోన్‌లలో మాత్రమే వీటిని అమర్చటం జరుగుతోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Interesting Facts About Mobile Processors. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot