బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

Posted By:

ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ 'నోకియా' త్వరలో కనుమరుగుకానుంది. నోకియా బ్రాండ్ పేరు స్ధానంలో 'మైక్రోసాప్ట్ లుమియా' పేరును అధికారికంగా మార్చినట్లు మైక్రోసాఫ్ట్ సంస్ధ తెలిపింది. ఈ మేరకు నోకియా ఫ్రాన్స్ ఫేస్‌బుక్ పేజ్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా పేజీలలో మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

ఇతర దేశాలు కూడా మార్చిన బ్రాండ్ పేరును ఉపయోగించేలా త్వరలో చర్యలు తీసుకుంటాం అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. తొలిసారిగా ఫ్రాన్స్ నుంచే మైక్రోసాప్ట్ లుమియా పేరు వాడుకలోకి రానుంది. స్మార్ట్‌ఫోన్లలో కూడా నోకియా పేరును మైక్రోసాఫ్ట్ తీసివేయనుంది.

నోకియా కంపెనీ మొబైల్‌ తయారీ యూనిట్‌ను 7.2 బిలియన్‌ డాలర్లతో మైక్రోసాఫ్ట్‌ గతంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం నోకియా వినియోగించే అన్ని వ్యవస్థల లైసెన్సుల కోసం కూడా మైక్రోసాప్ట్‌ పదికోట్ల డాలర్లను వెచ్చించింది.

కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల ఆవిష్కరణతో జనంలో ఫోటోగ్రఫీ పై మరింత మక్కువ పెరిగింది. ఒక్క 2011లోనే 375 బిలియన్ల చిత్రాలను కెమెరాలలో బంధించటం జరిగింది. వాటిలో అత్యధిక శాతం ఫోటోలను నోకియా కెమెరా ఫోన్‌ల ద్వారా చిత్రీకరించటం విశేషం. నోకియా తాను రూపొందించిన ప్రతీ కెమెరా ఫోన్‌కు ఓ చరిత్ర ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా నోకియా కెమెరా‌ ఫోన్‌లకు సంబంధించి నివ్వెరపోయే వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా మొదటి కెమెరా ఫోన్

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

నోకియా మొదటి కెమెరా ఫోన్ ‘నోకియా 7650' 2001లో విడుదలైన హాలీవుడ్ చిత్రం మైనార్టీ రిపోర్ట్‌లో వినియోగించారు.

నోకియా వీడియో రికార్డర్ ఫోన్‌

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

2003లో నోకియా వీడియో రికార్డర్ తో కూడిన మొట్టమొదటి ఫోన్‌ను ఆవిష్కరించింది. ఆ మోడల్ పేరు నోకియా 3650.

అత్యధిక డిజిటల్ కెమెరాల విక్రయించిన బ్రాండ్‌

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

2005లో నోకియా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిజిటల్ కెమెరాల విక్రయించిన బ్రాండ్‌గా గుర్తింపును మూటగట్టుకుంది.

డెడికేటెడ్ కెమెరా షట్టర్ బటన్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

2005లో నోకియా ఎన్70 పేరుతో డెడికేటెడ్ కెమెరా షట్టర్ బటన్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్‌‌తో

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

నోకియా నుంచి 2006లో విడుదలైన మరో కెమెరా ఫోన్ నోకియా ఎన్93 ఈ కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

కొడాక్‌కు మించి కెమెరాలను విక్రయించగలిగింది

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

2008లో నోకియా కొడాక్‌కు మించి కెమెరాలను విక్రయించగలిగింది.

నోకియా ఎన్8

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

2011లో ప్రపంచపు అతిపెద్ద స్టాప్-మోషన్ యానిమేషన్ చిత్రాన్ని నోకియా ఎన్8 ద్వారా చిత్రీకరించటం విశేషం.

నోకియా 808 ప్యూర్‌ వ్యూ

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

నోకియా 808 ప్యూర్‌ వ్యూ మోడల్‌లో ఏర్పాటు చేసిన కెమెరా సెన్సార్ వ్యవస్థ కంపాక్ట్ కెమెరాలకు రెండితల పెద్దది.

మనిషికన్నా300 రెట్లు వేగవంతంగా స్పందిస్తుంది

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

నోకియా లూమియా 920 మోడల్‌లో ఏర్పాటు చేసిన కెమెరా వ్యవస్థ మనిషికన్నా300 రెట్లు వేగవంతంగా స్పందిస్తుంది.

ఉత్తమ క్వాలిటీ ప్రో క్వాలిటీ చిత్రాలను క్యాప్చర్ చేయగలదు

బ్రాండ్ నోకియా.. 10 ఆసక్తికర నిజాలు

నోకియా లూమియా 925 చిన్నవైన లెన్స్ కలిగి ఉన్నప్పటికి ఉత్తమ క్వాలిటీ ప్రో క్వాలిటీ చిత్రాలను క్యాప్చర్ చేయగలదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Interesting Facts About Nokia Camera Phones. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot