టాయ్ ఫెయర్‌లో మ్యూజిక్ గాడ్జెట్ల కొలువు!!

Posted By:

టాయ్ ఫెయర్‌లో మ్యూజిక్ గాడ్జెట్ల కొలువు!!

 

బాల్యం ఎంత విలువైందో అందిరికి తెలుసు.. చిన్ననాటి మధుర స్మ్ళతులు అలుపెరగని ఉత్సాహాన్ని నింపుతాయి... ప్రత్యేకించి చిన్నారుల కోసం న్యూయార్క్ నగరంలో నిర్వహించిన టాయ్ ఫెయిర్‌కు విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులు పాటు నిర్వహించిన ప్రదర్శనను ఔత్సాహికులు పెద్ద ఎత్తున  సందర్శించారు. ఏటా చిన్నారుల కోసం నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల మ్యూజిక్ గ్యాడ్జెట్లతో పాటు మాట్లాడే జంతు బొమ్మలు, ఇతర ఆట వస్తువులను ప్రదర్శిస్తారు. వివిధ గ్యాడ్జెట్ కంపెనీలు ఈ వేదిక పై  తమ తమ గ్యాడ్జెట్‌లను ఆవిష్కరించాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్స్, ఎంపీత్రీ ప్లేయర్స్, ఐపోడ్స్, మ్యూజికల్ కీబోర్డ్స్, గిటార్స్, ఆండ్రాయిడ్ బోర్డ్ గేమ్స్, కిడ్-ఫ్రెండ్లీ టాబ్లెట్స్, మ్యూజికల్ టీ-షర్ట్స్ ఎగ్జిబిషన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting