జియోనీ భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లు

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోనీ తన ఎస్ సిరీస్ నుంచి జియోనీ ఎస్5.5 పేరుతో ప్రపంచపు అతి సన్నని స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుత బెస్ట్ మార్కెట్ ధర రూ.20,600. కేవలం 5.55 మిల్లీమీటర్ల మందంతో రూపకల్పన చేయబడిన ఆ నాజూకైన స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను తొలత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో ప్రదర్శించారు.

 
 జియోనీ భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ తక్కువ బరువు ఫోన్ 145.1 x 70.2 x 5.55మిల్లీ మీటర్ల చుట్టుకొలతను కలిగి ఉంటుంది. ఈ సూపర్ స్లిమ్ ఫోన్ మీ చేతిలో ఎంచక్కా ఇమడిపోతుంది. ఫోన్ ముందు వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన 3వ తరం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫోన్‌ను మరింత మృదువుగా తీర్చిదిద్దింది. ఏర్పాటు చేసిన అల్యూమినియమ్ ఫ్రేమ్ ఫోన్‌ డిజైనింగ్‌కు కొత్త లుక్‌ను తీసుకువచ్చింది.

 

జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే‌ను కలిగి ఉంటుంది (రిసల్యూషన్ సామర్థ్యం 1,920x1,080పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 441 పీపీఐ). ఒక్క మాటలో చెప్పాలంటే జియోనీ ఇలైఫ్ ఎస్5.5 స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేకు దగ్గర పోలికలను కలిగి ఉంటుంది.

జియోనీ భవిష్యత్ ఆవిష్కరణలకు సంబంధించి ఈ సంస్థ అధ్యక్షుడు విలియమ్ లూ అలానే జియోనీ ఇండియా హెడ్ అరవింత్ ఆర్ వోహ్రా ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలను క్రింది వీడియోలో చూడొచ్చు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Xx39toexEig?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Interview with William Lu President Gionee & Arvind R Vohra Head Gionee India. &#13; Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X