ఇంటెక్స్ ఆక్వా ఐ4 ప్లస్
స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో రాణిస్తున్న దేశవాళీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన ఆక్వా సిరీస్ నుంచి ‘ఆక్వా ఐ4 ప్లస్'పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,600.

ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే...
5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 854x480 పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ఇంటెక్స్ క్లౌడ్ అప్లికేషన్ ద్వారా 5జీబి వరకు క్లౌడ్ స్టోరేజ్ డేటాను ఉపయోగించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 220 గంటల స్టాండ్‌బై).
కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే:
3జీ కనెక్టువిటీ (డౌన్‌లోడ్ వేగం 7.2ఎంబీపీఎస్), హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ).
వుయ్ చాట్, ఓఎల్ఎక్స్ వంటి ఇన్స్‌టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసారు. నిక్షిప్తం చేసిన మరో అప్లికేషన్ మాతృభాషా ద్వారా 22 ప్రాంతీయ భాషల్లో ఫోన్‌ను యాక్సిస్ చేసుకోవచ్చు.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








