సెల్ఫీ ఫ్లాష్‌తో ఇంటెక్స్ 4జీ ఫోన్
ధర రూ.6,555.
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్, ఆక్వా ప్రైమ్ 4జీ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

ఫ్రంట్-ఫేసింగ్ ఎల్ఈడి సపోర్ట్ ప్రధాన ఆకర్షణగా వస్తోన్న వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.6,555. ఈ ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ కెమెరాలో సెల్ఫీ ఫ్లాష్‌తో పాటు పానోరమా మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, ఆటో క్యాప్చుర్ మోడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
Read More : రూ.2,999కే బ్రాండెడ్ 4జీ VoLTE స్మార్ట్‌ఫోన్

ఇంటెక్స్ ఆక్వా ప్రైమ్ 4జీ స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1GHz 32 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6735 ప్రాసెసర్, మాలీ 760 గ్రాఫిక్స్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 2800mAh బ్యాటరీ.
Read More : క్వాలిటీ తగ్గకుండా ఫోటో సైజును తగ్గించటం ఎలా..?


Click it and Unblock the Notifications








