టచ్ ఇంకా క్వర్టీ కీప్యాడ్‌తో ఇంటెక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్
టచ్ ఇంకా క్వర్టీ కీప్యాడ్ ఫీచర్లతో కూడిన సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ శుక్రవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇంటెక్స్ ఆక్వా క్వర్టీ పేరుతో రూపకల్పన కాబడిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ విలువ రూ.4,990. అత్యుత్తమ శ్రేణి టచ్ సెన్సిటివ్ స్ర్కీన్‌తో పాటు సందేశాలను వేగవంతంగా టైప్ చేసేందుకు ఫిజికల్ క్వీర్టీ కీప్యాడ్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో చేసారు. ఇంటెక్స్ ఆక్వా క్వర్టీ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లియితే......

3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే టచ్‌స్ర్కీన్,
క్వర్టీ కీప్యాడ్,
డ్యుయల్ కోర్ ప్రాసెసర్ (క్లాగ్ వేగం 1.2గిగాహెట్జ్),
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2.2 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ),
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications