ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2@రూ.5,999

Posted By:

ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2@రూ.5,999

దేశవాళీ బ్రాండ్‌లలో మొట్టమొదటి సారిగా భారత్‌లో ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ స్మార్ట్‌ఫో‌న్‌ను పరిచయం చేసిన ఇంటెక్స్ (Intex) తాజాగా ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2 పేరుతో సరికొత్త ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.5,999. ఇంటెక్స్ ఆక్వా స్టార్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ హ్యాండ్‌సెట్ 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్ప్రెడ్‌ట్రమ్ (ఎస్‌సీ7731) ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

ఇంటెక్స్ ఆక్వా స్టార్ 2@రూ.5,999

ఈ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ మెమరీ జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x854 పిక్సల్స్), 8 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, బ్లూ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యం కానుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Intex Aqua Star II With 8-Megapixel Camera Launched at Rs. 5,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot