ఇంటెక్స్ ఆక్వా స్టైల్ (వీడియో రివ్యూ)

Posted By:

ఇంటెక్స్ ఆక్వా స్టైల్ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటెక్స్ మొబైల్స్ మంగళవారం విడుదల చేసింది. ఫోన్ ధర రూ.5,990. డివైస్ కొనుగోలు పై ఫ్లిప్ కవర్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రచారకర్తగా ప్రముఖ నటుడు సుదీప్ (ఈగ విలన్) నియమితులయ్యారు. సుదీప్‌ తమ సంస్థ ఉత్పత్తులకు ఏడాది పాటు ప్రచారం చేస్తారని సంస్థ మార్కెటింగ్‌ డైరక్టర్‌ బన్సాల్‌ తెలిపారు.

ఇంటెక్స్ ఆక్వా స్టైల్ (వీడియో రివ్యూ)

ఇంటెక్స్ ఆక్వా స్టైల్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే... 4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్800x 480పిక్సల్స్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, మైక్రోయూఎస్బీ, ఏ-జీపీఎస్, బ్లూటూత్). బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ లభ్యంకానుంది.

ఇంటెక్స్ ఆక్వా స్టైల్ పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/EugYu2s6oLw?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot