రూ.2699కే ఇంటెక్స్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్

Posted By:

తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హోరాహోరి పోటీ నెలకున్న నేపధ్యంలో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌‍ఫోన్ తయారీ బ్రాండ్ ఇంటెక్స్ ‘ఆక్వా టీ2' అత్యంత చవక ధర ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.2,699. ఇప్పటికే మార్కెట్లోలభ్యమవుతోన్న మరో చవక ధర ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్ సెల్‌కాన్ ఏ35కే (రూ.2,799)తో పోలిస్తే ఇంటెక్స్ ఆక్వా టీ2 ధర రూ.100 తక్కువ.

రూ.2699కే ఇంటెక్స్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్

ఇంటెక్స్ ఆక్వా టీ2 స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో మాత్రమే లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ  స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (డబ్ల్యూసీడీఎమ్ఏ 2జీ + జీఎస్ఎమ్),
3.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (హెచ్‌వీజీఏ రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఎంటీ6571 ప్రాసెసర్ (మీడియాటెక్),
256 ఎంబి ర్యామ్,
512 ఎంబి ఇంటర్నల్ మెమరీ,
కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, బ్లూటూత్, వై-ఫై),
1200 ఎమ్ఏహెచ్ (లై-ఐయోన్) బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Intex Aqua T2 With Android KitKat Launched For Rs 2,699. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot