ఇంటెక్స్ ఆక్వా వీ2@రూ.3090

Posted By:

చౌక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల కంపెనీ ఇంటెక్స్ ‘ఆక్వా వీ2' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆవిష్కరించింది. ధర రూ.3090. రిటైల్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడికావల్సి ఉంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 ఇంటెక్స్ ఆక్వా వీ2@రూ.3090

ఇంటెక్స్ ఆక్వా వీ2 3.5 అంగుళాల HVGA డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్)ను కలిగి ఉంటుంది. 1గిగాహెర్ట్జ్ సింగిల్ కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్‌ను ఈ లోబడ్జెట్ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. ఆండ్రాయిడ్ 4.4 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.  256 ఎంబి ర్యామ్, 104 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 6 నుంచి 8 గంటలు, 180 గంటల స్టాండ్‌బై టైమ్). కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్, బ్లూటూత్, ఏ-జీపీఎస్).

English summary
Intex Aqua V2: Affordable 3G Smartphone Launched in India at Rs 3,090. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot