రూ.3,999కే ఆండ్రాయిడ్ నౌగట్ స్మార్ట్‌ఫోన్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఫోన్ దొరుకుతోంది.
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 4G VoLTE సపోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో ఇంటెక్స్ కంపెనీ ఓ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. పేరు Intex Aqua Zenith. ధర రూ.3,999.

అమెజాన్‌లో దొరుకుతోంది...
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఈ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నాయి. బ్లాక్ ఇంకా ఛాంపేన్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఇంటెక్స్ ఆక్వా జెనిత్ స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.1GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MTK6737M ప్రాసెసర్, మాలీ టీ720 ఎంపీ1 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000mAh బ్యాటరీ.

కనెక్టువిటీ ఫీచర్స్, ప్రీలోడెడ్ యాప్స్
కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE సపోర్ట్, డ్యుయల్ సిమ్ (4జీ+4జీ), వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్/ఏజీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రో యూఎస్బీ పోర్ట్), సెన్సార్స్ (గ్రావిటీ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్), ప్రీలోడెడ్ యాప్స్ (ఎఫ్9 యాప్స్, అమెజాన్ షాపింగ్, చిల్లిక్స్, ఫ్లిప్‌కార్ట్, డైలీ హంట్, గానా, గేమ్ ప్లే, హైక్, గేమ్‌లాఫ్ట్, న్యూస్ పాయింట్, యూసీ మినీ బ్రౌజర్, ఎక్స్‌ప్లోర్ కీబోర్డ్, టీ20 గేమ్).

తొలత షాప్‌క్లూస్‌లో విక్రయించారు..
మే, 2017లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను తొలత షాప్‌క్లూస్ రూ.4,999 ధర ట్యాగ్‌తో విక్రయించింది. ప్రస్తుతం అమెజాన్ వద్ద ఈ ఫోన్ ధర రూ.3,999గా ఉంది.


Click it and Unblock the Notifications








