ఫీచర్ రిచ్ ఇంటెక్స్ డ్యూయల్ సిమ్ ఫోన్ 2వేలకే!!

Posted By: Super

 ఫీచర్ రిచ్ ఇంటెక్స్ డ్యూయల్ సిమ్ ఫోన్ 2వేలకే!!

 

మొబైల్ ఫోన్‌ల నిర్మాణ సంస్థ ఇంటెక్స్ సరికొత్త శ్రేణిలో డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఉత్తమమైన ఫీచర్లతో సుసంపన్నమైన ఈ ఫోన్ పేరు హిప్ హోప్ HIPHOP, మరిన్ని వివరాల్లోకి వెళితే.....

డ్యూయల్ సిమ్ స్లాట్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ ద్వారా రెండు నెట్‌వర్క్‌లను ఏక కాలంలో ఆపరేట్ చేసుకోవచ్చు. 2.4 అంగుళాల స్ర్కీన్ ఉత్తమమైన రిసల్యూషన్‌ను కలిగి  ఉంటుంది. వేగవంతంగా స్పందించే శక్తివంతమైన ఇంటెల్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 1.3 మెగా పిక్సల్ కమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది.  మైక్రోఎస్టీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీ 8జీబి వరకు పెంచుకోవచ్చు.

పొందుపరిచిన ఎడ్జ్ వ్యవస్థ ఇంటర్నెట్  అవసరాలను తీరుస్తంది. అదేవిధంగా నిక్షిప్తం చేసిన బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. 2జీ నెట్‌వర్క్ (జీఎస్ఎమ్)ను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఇన్‌బుల్ట్ చేసిన ఆడియో, వీడియో ప్లేయర్ ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని పంచుతాయి. ఎఫ్ఎమ్ రేడియో సౌలభ్యతను సైతం శ్రోత వినియోగించుకోవచ్చు. వివిధ గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరిగా బ్యాటరీ బ్యాకప్ ను పరిశీలిస్తే  అమర్చిన స్టాండర్డ్ లియోన్ 2000mAh బ్యాటరీ 450 గంటల సుదీర్ఘ స్టాండ్ బై నిస్తుంది. ధర రూ.2,000.

ఫోన్‌‌లో నిక్షిప్తం చేసిన అదనపు ఫీచర్లు:

టార్చ్ లైట్,

డ్యూయల్ లాంగ్వేజ్ సపోర్ట్,

వాయిస్ రికార్డింగ్,

ఆటో కాల్ రికార్డింగ్,

మొబైల్ ట్రాకర్,

సౌండ్ రికార్డర్,

ఎఫ్ఎమ్ రికార్డర్,

మల్టీ టాప్ కీప్యాడ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot