ఇంటెక్స్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్!

Posted By: Staff

 ఇంటెక్స్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్!

కంప్యూటింగ్ ఉపకరణాలను రూపొందించటంలో గత కొంత కాలంగా క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖ దేశీయ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ (intex technologies)

స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి ప్రవేశించంది. ‘ఆక్వా 4.0’పేరుతో ఆండ్రాయిడ్ ఆధారిత సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇంటెక్స్ సోమవారం ఆవిష్కరించింది. ధర రూ.5,490. ప్రధానంగా యువతను దృష్టిలోఉంచుకుని ఈ హ్యాండ్ సెట్‌ను వృద్ధిచేసినట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,

800 మెగాహెర్జ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 2.3.5 ఆపరేటింగ్ సిస్టం,

3.5 అంగుళాల డిస్‌ప్లే,

3 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

జీ సెన్సార్, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సార్,

ఎఫ్ఎమ్ విత్ రికార్డింగ్,

బ్లూటూత్,

మైక్రోఎస్డీ కార్డ్ సౌజన్యంతో మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

క్వార్టర్ చివరినాటికి ఐదు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు:

ఈ త్రైమాసికం చివరినాటికి మరో ఐదు స్మార్ట్‌ఫోన్‌లను రూ.5000 నుంచి 10,000 ధరల మధ్య విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్, మొబైల్ బిజినెస్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot