రూ.6.649కే ఇంటెక్స్ 4G VoLTE ఫోన్

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్, తన Aqua సిరీస్ నుంచి లేటెస్ట్ ఎడిషన్ ఆండ్రాయిడ్ 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర రూ.6,649..

Aqua Selfie పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.6,649. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ సపోర్ట్‌తో వచ్చే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఈ ఫోన్‌కు మరో ప్రధాన హైలైట్.

ఇంటెక్స్ ఆక్వా సెల్ఫీ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ Spreadtrum SC9832A చిప్‌సెట్, 512MHz మాలీ-400 జీపీయూ,

ర్యామ్, స్టోరేజ్, కెమెరా

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

బ్యాటరీ ఇంకా ఇతర ఫీచర్లు..

3000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), ప్రీలోడెడ్ యాప్స్ (క్యూఆర్ కోడ్ స్కానర్, గానా, ప్రైమ్ వీడియో, విస్టోసో/జెండర్). ఫోన్ బరువు 178 గ్రాములు, చుట్టుకొలత 155×78.8×9.2 మిల్లీ మీటర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex launches Aqua Selfie with Android Nougat and 4G VoLTE at Rs.6,649. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot