ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు అనుష్క ప్రచారం

Posted By:

దక్షిణ భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ల పై పట్టుసాధించే క్రమంలో ఇంటెక్స్ టెక్నాలజీస్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో ముందుకొచ్చింది. ‘ఆక్వా స్టైల్ ప్రో' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటెల్ టెక్నాలజీస్ డైరెక్టర్ (మార్కెటింగ్) కేశవ్ బన్సల్, మొబైల్ బిజినెస్ సీనియర్ జనర్ మేనేజర్ సంజయ్ కుమార్, సినీ నటి అనుష్కలు ఆవిష్కరించారు. ఫోన్ ధర రూ.6,999. ఈ సందర్భంగా కేశవ్ బన్సల్ మాట్లాడుతూ నటి అనుష్క ఇంటెక్స్‌కు ఏడాది పాటు ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంటెక్స్ ‘ఆక్వా స్టైల్ ప్రో' కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...

ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు అనుష్క ప్రచారం

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్854× 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు),
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్),
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

రియల్ ఫుట్‌బాల్ 2014, ఫోటా, ఓఎల్ఎక్స్, ఇంటెక్స్ కేర్, ఒపెరా మినీ వంటి అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందస్తుగానే లోడ్ చేసారు. ఫోన్ కొనుగోలు పై ఉచిత ఫ్లిప్ కవర్‌ను ఇంటెక్స్ అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot